- Telugu News Photo Gallery Sports photos Indian cricketer manish pandey married south indian actress ashrita shetty love life
జట్టును ఛాంపియన్ మార్చిన ఆటగాడు.. క్రికెటర్ మైదానం నుండి నేరుగా వెడ్డింగ్ పెవిలియన్ చేరుకున్నాడు
Manish Pandey Wife: ఈ భారత బ్యాట్స్‌మాన్ దేశీయ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రతేక ముద్ర వేశాడు. ఐపిఎల్‌లో కూడా రికార్డు సృష్టించాడు.
Updated on: May 29, 2021 | 8:58 PM

మనీష్ పాండే ఐపీఎల్‌లో సెంచరీ సాధించినప్పుడు భారత క్రికెట్‌లో కనిపించాడు.ఐపీఎల్‌లో సెంచరీ చేసిన టీమిండియా తొలి బ్యాట్స్‌మన్. 2019లో మనీష్ వివాహం ఓ సౌత్ ఇండియన్ నటితో వివాహం జరిగింది. పాండే భార్య పేరు ఆశ్రిత శెట్టి. ఈ ఇద్దరి వివాహం కథ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ ఇద్దరి పెళ్లి తేదీ 2019 డిసెంబర్ 2 న జరిగింది. అయితే వీరి వివాహం అంత ఈజీగా కాలేదు..

వీరి వివాహం అయినప్పుడు అతను దేశీయ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ రెండింటిలోనూ చురుకుగా ఆడుతున్నాడు. క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత అతను భారత జట్టులో చోటు దక్కింది. కానీ ఈలోగా అతను వివాహం ఫిక్స్ అయ్యింది.

మనీష్ సారథ్యంలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది కర్నాటక జట్టు. ఈ ట్రోఫీ దక్కించుకున్న అనంతరం నేరుగా ముంబై చేరుకున్నాడు. అదే రోజు ఆశ్రిత శెట్టిను వివాహం చేసుకున్నాడు.

మనీష్ భార్య ఆశ్రిత శెట్టి సౌత్ నటి. ఆమె కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది. తమిళ చిత్రాల్లో నటించారు. 2010 లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ ఫ్రెష్ ఫేస్ అవార్డును గెలుచుకుంది.




