1/8

ఉగాది నాడు షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం.. తీపినిస్తుంది కొత్తబెల్లం.. ఇది ఆనందానికి సంకేతం.. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
2/8

ఉగాది పచ్చడిలో రెండో రుచి ఆమ్లం .. పులుపు.. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
3/8

ఉగాది పచ్చడిలో మూడో రుచి కటు.. అంటే కారం. ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది.
4/8

5/8

ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం.. ఉప్పు.. ఇది భయానికి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం..
6/8

ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతిముఖ్యమైదని తిక్త.. చేదు.. ఇది జీవితంలో కలిగే బాధలకు.. దుఃఖనికి సంకేతం.. ఈరుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది.
7/8

ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.
8/8

Ugadi Pacchadi