- Telugu News Photo Gallery Spiritual photos Travel tips in Summer: rishikesh these best hidden places for adventure know details
Travel Tips: రిషికేశ్‌కు వెళ్తున్నారా.. సమీపంలోని ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.. జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలుస్తాయి..
గంగానదీ తీరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రిషికేశ్ ఆధ్యత్మికంగానే కాదు ప్రకృతి అందంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. రెండు రోజుల పర్యటనకు రిషికేశ్ మంచి ప్రదేశం. ఇక్కడ మీరు గంగా హారతిని ఆస్వాదించవచ్చు. అంతేకాదు అనేక సాహస కార్యకలాపాలు చేయవచ్చు. అయితే రిషికేశ్ తో పాటు సమీపంలోని అందమైన ప్రదేశాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని సందర్శించడం ఒక అందమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.
Updated on: May 04, 2025 | 4:39 PM

వేసవి కాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటే ముఖ్యంగా ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే.. తేమ, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి హిల్ స్టేషన్లు ఉత్తమమైనవి. హిల్ స్టేషన్ల విషయానికి వస్తే రిషికేశ్ పేరు చాలా ముఖ్యమైనది. రిషికేశ్ సాయంత్రం గంగా హారతి, రాఫ్టింగ్ కు ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో ఇక్కడ రాఫ్టింగ్ బాగా ఆస్వాదిస్తారు.

సాహసయాత్రలకు రిషికేశ్ ఉత్తమమైనది. అయితే రిషికేశ్ నుంచి కొంచెం ముందుకు వెళితే.. మీరు ఒక అందమైన దృశ్యాన్ని కూడా చూస్తారు. అవును ఈ రోజు మనం రిషికేశ్ సమీపంలోని ఉత్తమ రహస్య ప్రదేశాల గురించి గురించి తెలుసుకుందాం. వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

కౌడియాల: రిషికేశ్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం గంగా నది ఒడ్డున ఉంది. సాహస ప్రియులకు ఇది ఒక స్వర్గం. ఇక్కడి రాఫ్టింగ్ రాపిడ్‌లు చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడకు వెళ్తారు. చుట్టూ ఉన్న అడవి , ప్రశాంతమైన వాతావరణం దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. ఇక్కడ రాఫ్టింగ్, క్యాంపింగ్, పక్షులను చూడటం, రాత్రి భోగి మంటలు ఆనందించవచ్చు.

ఘాట్ గడ్: రిషికేశ్ నుంచి 22 కి.మీ దూరంలో, శివపురి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం కూడా చాలా అందంగా ఉంది. ఇది అడవితో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం ప్రశాంతమైన వాతావరణం, కొండ జీవితానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే వ్యక్తులు తరచుగా ఒంటరిగా ఉంటూ డిజిటల్ డీటాక్స్ అనుభవిస్తారు. ఇక్కడ హోమ్‌స్టే చేయడం ద్వారా స్థానిక జీవనశైలిని ఆస్వాదించవచ్చు.

మోహన్ చట్టి: ఈ ప్రదేశం రిషికేశ్ నుంచి 17 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రదేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఇప్పుడు బంగీ జంపింగ్ కారణంగా ఇది నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. కానీ చుట్టుపక్కల అడవులు, హైకింగ్ ట్రైల్స్ వెరీ వెరీ స్పెషల్. ఇక్కడి ప్రశాంత వాతావరణం.. సాహస కార్యక్రమాలు రెండూ ఉత్తమమైనవి. మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా బంగీ జంపింగ్, ఫారెస్ట్ ట్రెక్కింగ్, యోగా రిట్రీట్ చేయండి.

కండి: రిషికేశ్ నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న కండి గ్రామం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాలు కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. "ఆఫ్‌బీట్ ట్రావెల్" ఇష్టపడే వారికి ఈ ప్రదేశం సరైనది. ఇక్కడ ప్రకృతి ఫోటోగ్రఫీకి చాలా అందంగా ఉంటుంది. పర్వతాల మధ్య గడిపే వ్యక్తుల జీవితాన్ని దగ్గరగా చూడవచ్చు.

ముని కి రేతి: రిషికేశ్ సమీపంలో ఉన్న పట్టణం మునికి రేతి.. అంటే "ఋషుల ఇసుక" అని అర్థం. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులకు సరైనది. త్రివేణి ఘాట్ ఉంది., ఇక్కడ గంగా, యమునా. సరస్వతి నదులు కలుస్తాయి ఇక్కడ అనేక చిన్న దేవాలయాలు, జలపాతాలు కూడా దాగి ఉన్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్, ధ్యానంతో పాటు అడవిని అన్వేషించడం ఇది మీ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా చేస్తాయి.




