- Telugu News Photo Gallery Spiritual photos These zodiac signs will be lucky in 2026 due to the transit of the Sun
కుంభరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండినట్లే!
సూర్య సంచారం వలన 2026లో ఐదు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. శక్తి వంతమైన గ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి. అయితే సూర్యడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు, దీని వలన 12 రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ప్రయోజనం చేకూరనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Oct 26, 2025 | 10:51 AM

కుంభ రాశి : సూర్యుడు కుంభ రాశిలోకి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనున్నది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యగాల్లో కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. చాలా సంతోషంగా గడుపుతారు.

మీన రాశి : 2026లో మీన రాశి వారికి అప్పుల బాధలు తీరిపోయి చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అంతే కాకుండా అన్ని పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికంది, ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.

మేష రాశి : సూర్య సంచారం వలన ఈ రాశి వారికి ధైర్యం, పెరుగుతుంది. మీరు కార్యాలయంలో మీ తోటి ఉద్యగుల మద్దతు పొందుతారు. ఆకస్మక ప్రయానాలు చేయాల్సి వస్తాయి. ఇవి మీకు లాభాలు తీసుకొస్తాయి , కొత్త ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. రచన , కమ్యూనికేషన్‌కు సంబంధించిన రంగాలలో మీరు ప్రయోజనం పొందుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారి విద్యార్థులు సూర్యు సంచారం ప్రయోజనాలు చేకూరుస్తుంది. వీరు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారు కూడా అత్యధిక లాభాలు అందుకొని, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి పెట్టిన దానికి ప్రతి ఫలం లభిస్తుంది. ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు.

తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. మీ కెరీర్‌లో కొన్ని అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఇంటా బయట మీపరపతి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించి, చాలా ఆనదంగా గడుపుతారు.



