- Telugu News Photo Gallery Spiritual photos These are the auspicious dates to buy a new vehicle in the month of December
శుభ ముహుర్తం..డిసెంబర్ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి శుభ తేదీలు ఇవే!
హిందూ మతంలో ఏ పని ప్రారంభించినా శుభ సమయం చూడటం అనేది సహజం. చాలా వరకు వివాహం సమయంలో, లేదా కొత్త ఇంటికి మారే విషయంలో శుభ సమయం గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. అంతే కాకుండా చిన్న వస్తువు కొనుగోలు చేసినా, ఏదైనా పని ప్రారంభించినా సరే మంచి రోజు, శుభ సమయం చూసి, పనిని ప్రారంభిస్తారు, లేదా ఏదైనా వాహనం వంటివి కొనుగోలు చేస్తారు.
Updated on: Nov 21, 2025 | 4:44 PM

ఇలాంటి ఆచార, సంప్రదాయాలు వేద కాలం నాటి నుంచి వస్తున్నాయి. అయితే గ్రహస్థానాలను బట్టి ఫలితాలు ఉంటాయని,మంచి సమయం, శుభ గడియలు చూస్తుంటారు. దీని వలన ప్రయాణాల్లో ఆటంకాలు రాకుండా, ఇంటా బయట అంత సానుకూల వాతావరణం ఉంటుందని నమ్మకం.

అయితే మీకోసం లేదా మీ కుటుంబం కోసం వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పకుండా ముహుర్తం చూసుకోవాలని చెబుతున్నారు పండితులు. శభ సమయాలు, శుభ తేదీలను తెలుసుకొని వాహనాలను కొనుగోలు చేయడం వలన మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయంట.

అయితే డిసెంబర్ నెల వస్తుంది. సంక్రాంతి, క్రిస్టమస్ సందర్భంగా చాలా కంపెనీలు ఆఫర్స్ ఇస్తుంటాయి. దీంతో ఈ నెలలో చాలా మంది కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే 2025 పంచాంగం ప్రకారం డిసెంబర్ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి శుభ తేదీలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2025లో డిసెంబర్ నెలలో వాహనం కొనుగోలు చేయడానికి డిసెంబర్ 1వ తేదీ సోమవారం చాలా మంచిది. ఈరోజు ఉదయం 6.57 AM నుంచి 7:01 PM వరకు మంచి సమయం. అలాగే డిసెంబర్ 4 గురువారం కూడా చాలా మంచి రోజు ఈ రోజు 4:54 నుంచి 2:50 వరకు మంచి సమయం. డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు కూడా వాహనాలు కొనుగోలు చేయడానికి శుభ సమయం. ఈ రోజు 7:00AM నుంచి 12:55AM వరకు మంచి సమయం.

అదే విధంగా డిసెంబర్ 7 వతేదీ ఆదివారం, డిసెంబర్ 8వ తేదీ సోమ వారం, డిసెంబర్ 9వ తేదీ , డిసెంబర్ 14,15,17,18,24,25,26,28, ఆది వారం వరకు మంచి రోజులు ఉన్నాయి. ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేయడం చాలా మంచిదంట.



