- Telugu News Photo Gallery Spiritual photos Sircilla handloom weaver makes saree matchbox of 100g Weight and gifts it to Vijayawada Kanaka Durga Temple
Indrakeeladri: దుర్గమ్మకు అగ్గిపెట్టిలో చీరను సమర్పించిన భక్తుడు.. 100 గ్రాముల బరువైన ఈ చీర విశిష్టత ఏమిటంటే?
బ్రిటిష్ వారు మనదేశానికి రాకముందు వరకూ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేయడం మన సొంతం అని పెద్దలు చెప్పిన సంగతి వినే ఉంటారు. అయితే ఆ మాటను నిజం చేస్తున్నాడు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కళాకారుడు.
Updated on: Apr 11, 2023 | 11:20 AM

బ్రిటిష్ వారు మనదేశానికి రాకముందు వరకూ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేయడం మన సొంతం అని పెద్దలు చెప్పిన సంగతి వినే ఉంటారు. అయితే ఆ మాటను నిజం చేస్తున్నాడు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కళాకారుడు.

చేనేత వస్త్రాల తయారీ నేర్పరి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నల్ల విజయ్.. ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. అరుదైన వస్త్రాలను తన ప్రతిభతో సృష్టిస్తున్నాడు.

సిరిసిల్లకు చెందిన విజయ్ అగ్గిపెట్టెలో పట్టేలా 100 గ్రాముల బరువు ఉండే చీరల తయారీలో నిపుణుడు. బంగారంతో పాటూ వెండితో ఈచీరలను నేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టేలో పట్టే చీరల్ని బహూకరించాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని మరో పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనుక దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే చీరను భక్తిశ్రద్దలతో బహూకరించాడు విజయ్.

ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో చీరను సమర్పించాడు విజయ్. ఈ చీర ఖరీదు సుమారు 45 వేల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. చీరను విజయ్ ఐదు గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేశాడు. అతి సుందరమైన ఈ పట్టు చీరను అమ్మలనుగమ్మ అమ్మ దుర్గమ్మకు సమర్పించాడు.

దుర్గమ్మ ఆలయ సిబ్బంది, అర్చకుల సమక్షంలో ఈ చీరను ఆవిష్కరించారు. 100 గ్రామల బరువుతో నేసిన బంగారపు మరియు వెండి కలబోసి చీర చూపరులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తనకు "చేనేత కళ అంటే ఎంతో ఇష్టం. చేనేత కళలో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటానని.. చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదని చెప్పారు. త్వరలోనే రంగులు మారే చీరను తయారు చేస్తానని కూడా చెప్పారు.




