బంతిపూలతో పూజ చేయకూడదా? అసలు విషయం ఏమిటంటే?
ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఇంట్లో చిన్న పూజ చేసినా బంతి పూలు ఉండటం అనేది చాలా కామన్. ఏ శుభకార్యం చేసుకున్నా ఇంటికి బంతిపూల దండలు కుచ్చి, ఈ పూలతో ఇంటిని అందంగా అలంకరిస్తుంటారు. ఇక ఒక్కో పూజలో ఒక్కో రకం పువ్వులు ప్రత్యేకంగా ఉంటాయి. చూడటానికి ఎంతో అందంగా కనిపించే పూలలో బంతి పూలు ఒకటి. అయితే పూలను అస్సలే పూజకు ఉపయోగించకూడదు అంటున్నారు పండితులు. దీని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Feb 14, 2025 | 8:52 PM

బంతి పూలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంటి అలంకరణలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా కొందరు ఈ పూలను పూజకు కూడా ఉపయోగిస్తారు. కానీ వీటితో పూజ చేయకూడదంట.

లేత పసుపు రంగు, ముదురు పసుపు రంగు, కాషాయం రంగులో ఈ పూలు పూస్తుంటాయి. ఇక ఈ పూలను ఎక్కువగా దీపావళి పండుగ సమయంలో ఇంటి అలంకరణకు, పూజకు ఉపయోగిస్తారు. అంతే కాకుండా బోనాల సమయంలో కూడా ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇక కొంత మంది తమ ఇంట్లో రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం సంధ్యావేళలో పూజ చేస్తుంటారు. అయితే వీరు పూజ సమయంలో తెలిసి తెలియక బంతి పూలను ఉపయోగిస్తారు కానీ అలా చేయకూడదంట.

చాలా మంది బంతి పూలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అని, పూజకు ఉపయోగిస్తారు. కానీ వీటితో పూజ చేయడం వలన ఎలాంటి ఫలితం దక్కదంట.

బంతి పూలకు శాపం ఉండడం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. వీటితో పూజ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, వీటిని కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగించాలంట.





























