- Telugu News Photo Gallery Spiritual photos Shani Astanga Dosha 2024: 6 Lucky Zodiac Signs to have Aishwarya yoga details in Telugu
Lord Shani Dev: శని ‘దోషం’తో వారికి ఐశ్వర్య యోగాలు.. ఇందులో మీ రాశి ఉందా..?
Shani Dosha Lucky Zodiac Signs: ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడికి ఈ నెల (ఫిబ్రవరి) 25న ఇదే రాశిలో రవి బాగా దగ్గరవుతున్నందువల్ల శనికి అస్తంగత్వ దోషం కలుగుతోంది. సూర్యుడి వేడిమికి, కిరణాలకు శని దగ్ధం అయిపోవడాన్ని అస్తంగత్వ దోషంగా పరిగణించడం జరుగుతోంది. ఈ శని అస్తంగత్వం మార్చి 14 వరకూ కొనసాగుతుంది. ఒక నెల రోజుల పాటు ఆరు రాశులకు విశేషంగా యోగించడం, శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. శని అస్తంగత్వం వల్ల బాగా లబ్ధి పొందే ఆరు రాశులుః మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు.
Updated on: Feb 20, 2025 | 1:01 PM

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న లాభాధిపతి శని అస్తంగత్వం చెందడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో శని అస్తంగత్వం చెందడం వల్ల ఈ రాశివారికి రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. భారీగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో సంపద కలిసి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యో గం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు లాభాలు బాగా పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో శని అస్తంగత్వ సంచారం వల్ల విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పడతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని అస్తంగతుడవుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలకు చికిత్స లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో శని అస్తంగత్వం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయం సాధించడం జరుగుతుంది. మీ సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభించి, వృత్తి, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే సూచనలు న్నాయి. ఆస్తిపాస్తులు, వాటి విలువ పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శని అస్తంగతుడు అవడం వల్ల ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. జీవితంలో దశ తిరుగుతుంది. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా చెలామణీ అయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.



