- Telugu News Photo Gallery Spiritual photos Raghavendra swamy temple mantralayam renovation with rs 2 crores
Mantralayam: 2వేల కోట్లతో మంత్రాలయంలో అభివృద్ధి పనులు.. గంగా నదిలా తుంగభద్రని శుభ్రం చేస్తామంటూ…
Raghavendra Swami: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ప్రముఖ గురువు. 16వ శతాబ్దంలో జీవించిన రాఘవేంద్ర స్వామి శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని భక్తులు కోరిన వరాలిచ్చే దేవుడిగా కొలుస్తారు.
Updated on: Aug 26, 2021 | 8:20 PM

శ్రీ రాఘవేంద్ర స్వామి 350 వ ఆరాధన మహోత్సవం ఏడు రోజులపాటు మంత్రాలయంలోని మఠంలో ఘనంగా జరుగుతున్నాయి.

కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా ఏడు రోజుల పాటు వార్షిక మత, సాంస్కృతిక కార్యక్రమాలు మఠంలో నిర్వహిస్తున్నారు.

మొదటి రోజు ఆరాధనా జెండా ఎగరవేశారు. అనంతరం రజత్ మంటపోత్సవాన్ని నిర్వహించారు. నాలుగోరోజు తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు మధ్యాన్న ఆరాధనలో శ్రీ రాఘవేంద్ర స్వామికి శేష వస్త్రాన్ని సమర్పించారు.

వరసగా రథోత్సవం, మునుపటి పీఠాధిపతి శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థ ఆరాధన ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజు రేపు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

2,000 కోట్ల వ్యయంతో మంత్రాలయంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. ప్రణాళిక ప్రకారం, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, స్నానపు గదులు సహా అభివృద్ధి పనులు నాలుగు దశల్లో చేపట్టట్టనున్నారు.

స్వామివారిని దర్శించుకుని ఆరాధనోత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ మేరకు భక్తుల కోసం ఆశ్రయం, ఆహారంతో సహా అన్ని ఏర్పాట్లను ఆలయాధికారులు చేశారు. .

గంగా నదిలా తుంగభద్ర ను కూడా శుభ్రం చేస్తామని సుబుధేంద్ర తీర్థ చెప్పారు, అంతేకాదు అయోధ్య రామ మందిరం రూపంలో మంత్రాలయంలో రామ మందిరం నిర్మించనున్నామని తెలిపారు.




