- Telugu News Photo Gallery Spiritual photos Planetary Transits in July: Favorable Outcomes for 6 Zodiac Signs Details in Telugu
July Horoscope: రాశి మారుతున్న కీలక గ్రహాలు.. జూలై నెలలో ‘హీరోలు’ ఈ రాశులవారే!
Telugu Astrology: జూలై నెలలో కొన్ని గ్రహాలు రాశులు మారడం వల్ల ఆరు రాశులు లబ్ధి పొందబోతున్నాయి. రవి, శుక్ర, కుజులు రాశుల మారడంతో పాటు శని వక్రగతి ప్రారంభం అవుతున్నందువల్ల ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రవి రాశి మార్పు వల్ల ఉద్యోగంలో అధికారం లభించడం, బాధ్యతలు పెరగడం వంటివి జరగవచ్చు. శుక్రుడు మారడం వల్ల కుటుంబ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. శని మార్పు వల్ల ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారికి తప్పకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి.
Updated on: Jun 25, 2025 | 6:56 PM

మేషం: ఈ రాశికి రవి, శుక్రులు బాగా అనుకూలంగా మారడం వల్ల ఉద్యోగంలో హోదాలు గానీ బాధ్య తలు గానీ పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా పురోగతి ఉంటుంది. ఆదాయపరంగా కొన్ని ఆకస్మిక పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు, రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం: గ్రహాల మార్పువల్ల ఈ రాశికి ధన, లాభ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల అన్ని వైపుల నుంచి ఆదాయం పెరగడం, లాభాలు కలగడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి లాభ, ధన, భాగ్యాధిపతుల బలం పెరుగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

సింహం: ఈ రాశివారికి రాశ్యధిపతి రవి, దశమాధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేయడం వల్ల ఉద్యోగ జీవితంలో దశ, దిశ మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. జీవనశైలిలో కొన్ని సంచలన మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో, లాభాధిపతి రవి దశమంలో సంచారం చేయడం, ఆరవ స్థానంలో శని వక్రించడం వల్ల నెల రోజుల పాటు ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి.

మకరం: ఈ రాశికి శని, రవి, శుక్రులు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారడం వల్ల ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది బాటపడతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.



