- Telugu News Photo Gallery Spiritual photos navratri 2022: follow these rules if you lit akhand jyoti in dasara navaratri
Navaratri 2022: నవరాత్రుల్లో అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారా.. ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సిందే..
Navaratri 2022 నవరాత్రులలో చాలా మంది అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్మకం. అఖండ దీపం వెలిగిస్తే.. దుర్గాదేవి ప్రసన్నురాలై కోరిన కోర్కెలు తీరుస్తుందని విశ్వాసం. జ్యోతిష్యం ప్రకారం అఖండ దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలను పాటించాలి.
Updated on: Sep 25, 2022 | 2:50 PM

దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది నవరాత్రులలో ఉపవాసం ఉంటారు. నియమ నిబంధల ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా చాలా మంది అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇలా అఖండ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయని నమ్మకం. అయితే ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి.

అఖండ దీపాన్ని ఇత్తడి లేదా మట్టి దీపంలో మాత్రమే వెలిగించాలి. దీపం కొండెక్క కుండా చూసుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. దీపాన్ని ఎల్లప్పుడూ ప్లేట్ లో అక్షతలు వేసి పెట్టాలి.

అఖండ దీపం ఆరిపోకుండా.. దీపాన్ని గాజు చిమ్మెతో కవర్ చేయవచ్చు. దీంతో దీపం ఆరిపోదు. రాత్రి పడుకునే ముందు దీపంలో నెయ్యి, నూనె వేసిన తర్వాతే నిద్రించాలి. అఖండ దీపాన్ని తరచుగా మార్చకూడదు. అఖండ జ్యోతిని నవరాత్రి తొమ్మిది రోజులు ఆరకుండా చూసుకోవాలి. అఖండ దీపం సరిపోవడం శ్రేయస్కరం కాదు.

ఈ దీపాన్ని తొమ్మిది రోజుల పాటు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. దీపం ఒత్తిగా కాటన్ బట్టను ఉపయోగించండి. దీపాన్ని గాలి తగలకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. అఖండ దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనె వేస్తూ ఉండాలి. ఆరిపోకుండా ఒత్తిని జాగ్రత్తగా చూసుకోవాలి.

శుభ్రమైన చేతులతో మాత్రమే అఖండ దీపాన్ని తాకాలి. తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని మీరు స్వయంగా ఆర్పవద్దు. అది దానంతటదే ఆరిపోనివ్వండి. దీపాన్ని స్వయంగా ఆర్పడం అశుభం.




