- Telugu News Photo Gallery Spiritual photos Mars Sun Venus Conjunction in Scorpio Brings Challenges for 5 Zodiac Signs Telugu Astrology
Telugu Astrology: దుస్థానాల్లో అధిక గ్రహాలు.. అన్ని విషయాల్లోనూ ఈ రాశుల వారు జాగ్రత్త!
ప్రస్తుతం వృశ్చిక రాశిలో రాశ్యధిపతి కుజుడితో పాటు, రవి, శుక్రులు కూడా సంచారం చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి డిసెంబర్ 7 వరకూ కొనసాగుతుంది. ఈ విధంగా ఒక రాశిలో ఎక్కువ గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతున్నప్పటికీ, ఈ గ్రహాలు దుస్థానాల్లో ఉన్న రాశులకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పకుండా కలుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం 3, 6, 7, 8, 12 స్థానాలను దుస్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనూ రాశులకు దుస్థానాల్లో ఈ మూడు గ్రహాల సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
Updated on: Nov 25, 2025 | 7:12 PM

మేషం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో సహా మూడు గ్రహాల సంచారం వల్ల అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ప్రతి చిన్న పనికీ ఎక్కువగా కష్టపడడం జరుగు తుంది. కష్టార్జితంలో అధిక భాగం ఏదో విధంగా వృథా అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం, వ్యయ ప్రయాసలతో గానీ ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా పీడిస్తాయి. లేని పోని వివాదాలు తలెత్తుతాయి.

వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో మూడు గ్రహాల సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా చికాకులు, అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి లేదా తప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలగడం, మోసపోవడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు, నిరాశలు ఎక్కువగా కలుగుతాయి.

మిథునం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి, కుజ, శుక్రుల కలయిక వల్ల సంపాదనలో ఎక్కువ భాగం నష్టపోవడం, వృథా కావడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నమ్మినవారి వల్ల మోసపోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు మరింతగా ముదిరే అవకాశం ఉంది. సహాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేయడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఊహించని వైఫల్యాలు ఎదురవుతాయి.

కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, రవి, శుక్రులు యుతి చెందడం వల్ల ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ విభేదాలు ఏర్పడతాయి. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థికంగా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు.

ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో ఎక్కువ గ్రహాలు చేరడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సుఖ సంతోషాలు తగ్గుతాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. సన్నిహితులు మోసగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. రహస్య శత్రువులు తయారవుతారు. రహస్యాలను, బలహీనతలను బయటపెట్టి ఇబ్బంది పడే అవకాశంఉంది.



