AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీదేవికి కమలం పువ్వు సమర్పిస్తున్నారా? మర్చిపోయి కూడా ఈ పొరపాటు చేయకండి

దీపావళి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌ను కొన్ని చోట్ల ఐదు రోజు మరికొన్ని చోట్ల మూడు రోజులు జరుపుకుంటారు. ఇక దీపావళి పండుగ ధంతేరాస్, ధన త్రయోదశి నుంచి ప్రారంభం అవుతుంది.

Samatha J
|

Updated on: Nov 04, 2026 | 3:17 PM

Share
2026లో ధన త్రయోదశి నవంబర్ ఆరున వస్తుంది. అలాగే దీపావళి పండుగ నవంబర్ 8 ఆది వారం రోజున వస్తుంది. దీనిని దీపాల పండుగ, శ్రేయస్సు  తీసుకొచ్చే పండుగ అని కూడా అంటారు. ఈ రోజు దీపాలను వెలిగించడమే కాకుండా, చిన్న వారు పెద్దవారు అందరూ ఆనందంగా టపాసులు కాల్చుతారు.

1 / 5
 ఇక దీపావళి పండుగలో ఉన్న ప్రత్యేకం లక్ష్మీదేవిని పూజించడం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతే కాకుండా ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు, పండ్లు, పువ్వులు సమర్పించి, అమ్మవారిని ఆశీస్సులు అనుగ్రహం పొందడం జరుగుతుంది.

2 / 5
దీపావళి పండుగలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అమ్మవారుకు ఇష్టమైన కమలం పువ్వును సమర్పించి పూజిస్తుంటారు. దీని వలన సకల శుభాలు కలుగుతాయి అని చెబుతంటారు. అయితే లక్ష్మీదేవికి కమలం పువ్వు సమర్పించడం చాలా మంచిది. కానీ దీనిని సమర్పించే సమయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

3 / 5
లక్ష్మీదేవి కమలం నుంచి  అవతరించి అంటారు. అందుకే చాలా మంది పూజ సమయంలో అష్ట కమలాలను సమర్పిస్తుంటారు. అందువలన దీపావళికి పూజ చేసినా తప్పకుండా కమలం పువ్వును సమర్పించాలంట. ఎవరు అయితే ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవికి కమలం పువ్వు సమర్పిస్తారో, వారి జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారంట.

4 / 5
అయితే కమలం పువ్వు సమర్పించే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా విరిగిన లేదా పాడైపోయి పువ్వును సమర్పించకూడదు. తాజాగా పూసిన పువ్వును సమరపించడం మంచిది. అమ్మవారికి సమర్పించే పువ్వు స్వచ్ఛంగా తాజాగా, పరిశుభ్రంగా ఉండాలి. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us