- Telugu News Photo Gallery Spiritual photos Know how the human soul goes to Yamadharma Raja after death
చనిపోయాక యముడి వద్దకు ఆత్మ ఎలా వెళ్తుందో తెలుసా..భయపడకుండా చదవండి!
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక మానుదు అనే నానుడి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చావు అనేది సహజమైనది. ఎంతో మంది వయసు పైబడి, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఇప్పటికీ ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గరుడ పురాణంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం గరుడ పురాణం ప్రకారం, చనిపోయిన తర్వాత ఆత్మ యమధర్మ రాజు వద్దకు ఎలా వెళ్తుందో చూద్దాం.
Updated on: Aug 11, 2025 | 11:53 AM

చనిపోయాక ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఇది ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ లాంటిదే. చాలా మంది దీని గురించి కథలు కథలుగా చెబుతుంటారు. కొంత మందేమో కోరికలు తీరకపోతే ఆ వ్యక్తి భూమిపైనే ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతుందని, మరికొంత మందేమో, ఆత్మ తన అంత్య క్రియల నుంచి కర్మకాండలు పూర్తి అయ్యే వరకు భూమిపైనే ఉంటుందని చెబుతుంటారు.

అయితే దీని గురించి సరైన సమాధానం మాత్రం తెలియదు. అయితే గరుడ పురాణంలో మాత్రం దీని గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఒక వ్యక్తి చనిపోయే ముందే వారికి సృష్టి మొత్తం కనిపిస్తుందంట. అంతే కాకుండా వారికి మాట పడిపోవడం, కళ్లతో అన్నీ చూడటం చేస్తారంట. కానీ ఏదీ చెప్పడానికి వీలు లేకుండా కదలిక ఉండకపోవడం, మాటలు రాకపోవడం జరుగుతుందంట.

ఇక కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది అనే సమయానికి ఇద్దరు యమధూతలు కనిపిస్తారంట. వారు, చాలా భయంకరంగా ఉంటారంట. పెద్ద పెద్ద గోర్లతోటి, నల్లగా, సరిగ్గా లేని తల, శరీరా ఆకృతి చాలా భయంకరంగా ఉంటుందంట. చనిపోయే వ్యక్తులు వారిని చూసి చాలా భయపడిపోతారంట. దీంతో కొంత మంది చనిపోయే ముందు వారిని చూసి భయపడి బిగ్గరగా అరవడం, మల మూత్ర విసర్జన చేయడం చేస్తుంటారంట.

ఇక చనిపోయిన వెంటనే ఆత్మలను యమదూతలు యమధర్మ రాజు వద్దకు తీసుకెళ్లడానికి కనీసం 47 రోజులు పడుతుందంట. ఈ సమయంలో వారు ఆత్మను తీసుకెళ్లే క్రమంలో, యమదూతలను చాలా ఇబ్బంది పెడతారంట, దీంతో వారు ఆత్మలను కొట్టడం, బెదిరించడం లాంటివి చేస్తారంట. అంతే కాకుండా ఆత్మలకు నరకంలో జరిగే శిక్షల గురించి కూడా చెబుతారంట. దీంతో ఆత్మలు చాలా ఏడుస్తూ నన్ను తీసుకెళ్ల వద్దు అంటూ ప్రాధేయపడతాయంట.

ఇక ఒక వ్యక్తి చేసిన పాప పుణ్యాల ఆధారంగా యమధర్మ రాజు ఆత్మలకు శిక్షలు విధిస్తాడంట. అయితే ఈ సమయంలో ఆత్మ మరోసారి భూలోకానికి చేరుతుందంట. ఎందుకంటే? తాను చేసిన పాప పుణ్యాలు లెక్కించడానికి ఆత్మను తమ బంధువుల వద్దకు పంపిస్తుందంట. ఆలోపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందంట. లేదంటే యమలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఆత్మ అక్కడే ఉంటుందంట. ( నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



