- Telugu News Photo Gallery Spiritual photos If you put a hanger on the back side of the door, It's like bringing poverty into the house.
డోర్ బ్యాక్ సైడ్ హాంగర్ పెడితే.. దరిద్రాన్ని లీజుకి తీసుకున్నట్టే
భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో ఉంచుకొనే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమలు పాటించాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా.. అలాగే వాస్తు విషయంలో కొన్ని చిన్న చేసిన వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామా.?
Updated on: Nov 15, 2025 | 10:33 AM

భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో ఉంచుకొనే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమలు పాటించాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు.

ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా.. అలాగే వాస్తు విషయంలో కొన్ని చిన్న చేసిన వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామా.?

చాలామంది వారి ఇంటి మెయిన్ డోర్స్, బెడ్ రూమ్ డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. వీటికి బట్టలను హ్యాంగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రూమ్ మెస్సీగా కనిపించకుండా క్లీన్గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇలా డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఉంచడం పెద్ద తప్పని వాస్తు శాస్త్రం చెబుతుంది.

డోర్స్ వెనుక ఏర్పాటు చేసిన హ్యాంగింగ్స్కి కొన్ని రకాల వస్తువులను తగిలిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇంట్లో పురోగతి తగ్గుతుందుని పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీ దేవికి స్థానంగా చాలామంది నమ్ముతారు. అందుకే ఇలా డోర్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట.

అలాగే కాకుండా ఖాళీగా ఉంది కదా అని ఇంటి డోర్ల మీద టవల్స్, బట్టలు ఆరబెట్టడం కూడా మంచిది కాదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు, గొడవలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.




