- Telugu News Photo Gallery Sending red heart emoji on whatsapp can lead to jail and fine of 20 lakh rupees know the whole story
Whatsapp: వామ్మో.! ఆ ఎమోజీని వాట్సాప్‌లో పంపిస్తే.. రూ. 20 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు..
ప్రపంచమంతా వాట్సాప్ యూజర్లు బోలెడంత మంది ఉన్నారు. ఆఫీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటూ వివిధ గ్రూప్‌లు మైంటైన్ చేస్తూ.. ప్రతీ రోజూ ఎన్నో షేర్ చేసుకుంటుంటారు. అప్పుడప్పుడూ ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసుకునేందుకు ఎమోజీలు కూడా పెడుతుంటాం.
Updated on: Feb 22, 2022 | 4:27 PM

ప్రపంచమంతా వాట్సాప్ యూజర్లు బోలెడంత మంది ఉన్నారు. ఆఫీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటూ వివిధ గ్రూప్‌లు మైంటైన్ చేస్తూ.. ప్రతీ రోజూ ఎన్నో షేర్ చేసుకుంటుంటారు. అప్పుడప్పుడూ ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసుకునేందుకు ఎమోజీలు కూడా పెడుతుంటాం. అయితే మీరు పెట్టిన ఓ ఎమోజీ కారణంగా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా.? నిజమండీ.! తాజాగా వాట్సాప్ ఓ కొత్త రూల్ అమలులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పలు దేశాల్లో వాట్సాప్‌పై వివిధ నిబంధనలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా దేశం వాట్సాప్ యూజర్లకు ఓ షరతు విధించింది. ఎదుట వ్యక్తుల అనుమతి లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీని వాట్సాప్‌లో పంపితే నేరంగా పరిగణిస్తామని అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

ఎదుటవారికి అనుమతి లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీని పంపిస్తే.. వేధింపులకు గురి చేయడంతో సమానం అని.. తీవ్రమైన నేరంగా పరిగణనలోకి వస్తుందన్నారు. అలాగే ఎవరైతే రెడ్ హార్ట్ ఎమోజీని రిసీవ్ చేసుకుంటారో.. వారు లీగల్‌గా యాక్షన్ తీసుకుంటే.. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు అక్కడి యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు.

వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిన వ్యక్తి దోషిగా తేలితే.. సౌదీ చట్టం ప్రకారం అతనికి 2 నుండి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష, లక్ష సౌదీ రియల్స్.. మన కరెన్సీలో అక్షరాలా రూ. 20 లక్షలు జరిమానా విధిస్తారట.

ఒకవేళ ఇదే నేరాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు చేస్తే.. 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల సౌదీ రియల్స్(మన కరెన్సీలో రూ. 60 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందట. సౌదీలో ఎదుటవారికి ఇష్టం లేకుండా చాట్ చేయడం పెద్ద నేరంగా భావిస్తారు.

వాట్సాప్‌లో ఎన్నో రకాల ఫీచర్లు, అబ్‌స్ట్రాక్ట్ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇదే రూల్.. మన దేశంలో పెడితే.. ఇక అంతే కదా.. ఫ్రెండ్స్, లేదా లవర్‌కు అలాంటి ఎమోజీ పంపడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం.




