- Telugu News Photo Gallery Science photos What happened if oxygen persentage increase in earth weather
మన వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం రెట్టింపు అయితే? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలిస్తే షాక్ అవుతారు..
మన వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం రెట్టింపు అయితే? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలిస్తే షాక్ అవుతారు..
Updated on: May 12, 2021 | 10:50 PM

దేశం ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడేందుకు పోరాటం సాగిస్తోంది. కరోనా పేషెంట్లకు ఆక్సీజన్ అందక ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రాణ వాయివు కొరతతో యావత్ దేశం అతలాకుతలం అవుతోంది. అయితే.. ఇంతటి ముఖ్యమైన ఆక్సీజన్ పరిమాణం భూమిపై ప్రస్తుతం ఉన్నదానికంటే రెట్టింపు అయితే?. విపత్తు నేపథ్యంలోంచి వచ్చిన ప్రశ్నే అయినా.. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ప్రస్తుతం మన వాతావరణంలో 20.3% ఆక్సిజన్ ఉంది.

ఐఎన్ఎస్‌హెచ్ నివేదిక ప్రకారం.. మన వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం రెట్టింపు అయితే, చిన్న కీటకాలు, బొద్దింకలు వంటి ఇతర పురుగుల పరిమాణం చాలా పెద్దదిగా మారుతుంది. హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా కీటకాలు భారీగా పెరుగుతాయి.

ఆక్సీజన్ ఎక్కువ అయితే.. మానవులు అధిక శక్తిని పొందుతారు. అయితే, శరీరంలో ఆక్సీజన్ స్థాయి పెరగడం వల్ల అది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువ ఆక్సీజన్ వల్ల లేని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

ఆక్సిజన్ అగ్నికి ఆజ్యం లాంటిది. వాతావరణంలో ఆక్సీజన్ శాతం రెట్టింపు అయితే.. నిరంతరం అగ్ని ప్రమాదాలను చూడాల్సిందే. అటవీ ప్రాంతాల్లో నిత్యం ఎక్కడోచోట అగ్ని ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది. మంటల తీవ్రతను ఆక్సీజన్ మరింత పెంచడమే ఇందుకు కారణం.

ఒక వ్యక్తి రోజుకు 23,000 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. అది మనుషులు, జంతువుల మధ్య ఈ విషయంలో వ్యత్యాసం ఉంటుంది. అయితే, వాతావరణంలో ఆక్సీజన్ పర్సంటేజీ పెరిగినట్లయితే.. సమతుల్యత మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఇక ఎవరైనా సరే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే వెంట ఆక్సీజన్ సిలిండర్లు ఉండాల్సిందే. అదే వాతావరణంలో ఆక్సీజన్ పర్సంటేజీ పెరిగితే మాత్రం సిలిండర్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఎంత ఎత్తైన శిఖరాన్ని అయినా సులభంగా చేరుకోవచ్చు.





























