- Telugu News Photo gallery Science photos Ice vs Water Wine Why Ice Floats in Water and Sinks in Alcohol Known the Science Behind it
Ice vs Water – Wine: ఐస్ గడ్డ నీటిలో తేలుతుంది.. మద్యంలో మునుగుతుంది.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!
ఐస్ క్యూబ్స్ నీటిలో తేలుతూ ఉంటాయి. కానీ వైన్ గ్లాస్‌లో వేస్తే మునిగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది.
Updated on: Dec 19, 2021 | 9:15 PM

దీనికి ఆన్సర్ భౌతికశాస్త్రం ద్వారా తెలుసుకుందాం. ఐస్ క్యూబ్స్ నీటిలో తేలడానికి, ఆల్కహాల్‌లో మునిగిపోవడానికి సాంద్రతే ప్రధాన కారణం. ఏ ద్రవంలో మునిగిపోతుందో ఆ ద్రవం కంటే ఐస్ క్యూస్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. నీరు, మద్యం విషయంలో ఇదే నియమం వర్తిస్తుంది.

ఆల్కహాల్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 0.789, నీటి సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 1.0. అదే సమయంలో, మంచు సాంద్రత 0.917 క్యూబిక్ సెంటీమీటర్లు. అంటే, మంచు సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి నీటిలో వేస్తే అది తేలుతుంది. అదేవిధంగా, ఆల్కహాల్ సాంద్రత మంచు గడ్డ కంటే ఎక్కువగా ఉన్నందున మంచు మునిగిపోతుంది.

సాంద్రత అంటే ఏంటి? ఈ సాంద్రతను ద్రవ్యరాశి, ఘనపరిమాణం ఆధారంగా గణిస్తారు. సాంద్రత సూత్రాన్ని గ్రీక్ శాస్త్రవేత్త ఆర్కిమెడెస్ కనుగొన్నారు.

Ice vs Water - Wine: ఐస్ క్యూబ్స్ నీటిలో తేలుతూ ఉంటాయి. కానీ వైన్ గ్లాస్‌లో వేస్తే మునిగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దీని కారణంగానే ఆల్కహాల్‌లో ఐస్ ముక్కను వేస్తే మునిగిపోతుంది. నీటిలో వేస్తే తేలుతూ ఉంటుంది. ఇంతకీ ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..





























