AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: శని, గురు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!

Income Horoscope: జీతభత్యాలకే పరిమితం కాకుండా అదనపు ఆదాయం సంపాదించాలని ప్రయత్నించే వారికి ఈ నెల 23వ తేదీ నుండి మంచి అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదనపు ఆదాయ మార్గాలు విస్తరించనున్నాయి. ఈ అదనపు ఆదాయం వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చి అనేక లాభాలను అందిస్తుంది. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం వల్ల సంపద వృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడతాయి.

Money Astrology: శని, గురు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
Money Astrology 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 1:41 PM

Share

జీతభత్యాలు కాకుండా అదనపు ఆదాయం కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యే రాశుల్లో వృషభం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశులు ఉండబోతున్నాయి. వీరికి ఈ నెల 23 నుంచి అందుకు అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఓవర్ టైమ్ కాకుండా ఎక్కడైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం, వడ్డీలకు డబ్బు ఇవ్వడం, ఫిక్సెడ్ డిపాజిట్ల మీద వడ్డీ రావడం, షేర్లు, స్పెక్యులేషన్లు లాభిచడం అదనపు ఆదాయానికి ఉన్న ముఖ్యమైన మార్గాలు. ఈ అదనపు ఆదాయం వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి. శని, గురువులు సంపద పెరిగేందుకు వీరికి బాగా అవకాశాలనివ్వడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి సాధారణంగా ధన సంపాదన మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశివారు రాబోయే రెండు మూడు నెలల్లో షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా బాగా సంపాదించే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని వడ్డీలకు తిప్పడం, మరో సంస్థకు కూడా పనిచేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం సంపాదించు కుంటారు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  2. మిథునం: ఈ ఏడాదంతా వీరి దృష్టి ఎక్కువగా అదనపు ఆదాయం మీద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ధన కారకుడైన గురువు బాగా అనుకూంగా ఉన్నందువల్ల మదుపులు, పొదుపులు ఎక్కువగా ఉంటాయి. అదనపు ఆదాయం సహాయంతో గృహ, వాహన, ఆధునిక సౌకర్యాలను అమర్చు కుంటారు. ఆదాయ వృద్ధి వీలైనన్ని మార్గాలు సంపాదిస్తారు. ఎక్కువగా పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ప్రయత్నించడం జరుగుతుంది. ఉద్యోగంలో అద‍నపు రాబడికి కూడా బాగా అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా ఫలితాలనిస్తాయి. అష్టమ శని వల్ల కాస్తంత ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. అదనపు ఆదాయానికి వీరు ఎటువంటి అవకాశాన్నయినా సద్వినియోగం చేసుకుంటారు. వడ్డీ వ్యాపారాలు చేయడం, బ్యాంకులకు ఏజెంట్ గా వ్యవహరించడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లలో కూడా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశివారికి జీతభత్యాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదనపు ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మీద కూడా దృష్టి పెడతారు. గురు బలం వల్ల ఆదాయ వృద్ది మీద ఆశ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. షేర్లు, మదుపులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. డబ్బును లాభసాటిగా మదుపు చేయడమే వీరి ప్రధాన లక్ష్యం అవుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి అదనపు ఆదాయం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఇతర సంస్థలకు కూడా పని చేయడంతో పాటు ప్రస్తుతం చేస్తున్న సంస్థలోనే ఓవర్ టైమ్ పనిచేయడం వల్ల అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. షేర్ల మీద అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలను విస్తరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా వీరు మరింతగా అదనపు ఆదాయాన్ని సాధించుకుంటారు.
  6. కుంభం: ఓ మూడు నెలల పాటు ఈ రాశివారి దృష్టంతా ఆర్థిక స్థిరత్వం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి వీరు ఎక్కువగా పాటు బడే అవకాశం ఉంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఓవర్ టైమ్, ఇతర సంస్థలకు సేవలందించడం వంటి మార్గాల ద్వారా వీరు అదనపు ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరికి తప్పకుండా అదనపు అవకాశాలు కలిసి వచ్చి, ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.

Follow Us