- Telugu News Photo Gallery Science photos America space center nasa releases stunning photo of beautiful blue dunes on mars
NASA Rover: భూమిపైనే కాదు.. అంగారకుడిపైనా అందమైన ప్రదేశాలు.. నాసా విడుదల చేసిన పిక్ చూస్తే వావ్ అనాల్సిందే..
NASA Rover: భూమిపైనే కాదు.. అంగారకుడిపైనా అందమైన ప్రదేశాలు.. నాసా విడుదల చేసిన పిక్ చూస్తే వావ్ అనాల్సిందే..
Updated on: Apr 11, 2021 | 6:18 PM

అంగారక(మార్స్) గ్రహం గురించి అన్వేషణకు శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆ కారణంగానే ప్రపంచంలోని ప్రతీ దేశం ఈ మార్స్‌ను చేరుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. తమ తమ దేశాలకు చెందిన సైంటిస్టులతో కొత్త ప్రయోగాలకు తెరలేపుతున్నాయి.

ఈ విషయంలో అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఇప్పటికే నాసా పర్సీవరెన్స్ రోవర్‌ను మార్స్‌పైకి పంపించింది. ఆ పర్సీవరెన్స్ రోవర్ ఎన్నో అందమైన ఫోటోలను నాసా సెంటర్‌కు పంపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పర్సీవరెన్స్ రోవర్ మరికొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంపించింది.

మీరు నీలి చందమామ గురించి విని ఉంటారు.. నీలి రంగులో ఉండే నీటి సరస్సులను చూసి ఉంటారు.. కానీ నీలి వర్ణంలో ఉన్న ఇసుక దిబ్బలను ఎప్పుడైనా చూశారా? అదీ మార్స్‌పై నీలి ఇసుక దిబ్బల ఉంటాయని మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. మార్స్ ఉపరితలంపై అందమైన నీలి ఇసుక దిబ్బలను ఇప్పుడు చూసేయండి.

అవును మార్స్ ఉపరితలంపై ఉన్న నీలి ఇసుక దిబ్బలను పర్సీవరెన్స్ రోవర్ తన కెమెరాలో బందించింది. దానికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను నాసా కేంద్రానికి పంపించింది. ఈ ఫోటోలను నాసాగా తాజాగా సోషల్ మీడియాలోకి విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేసిన నాసా.. ‘బ్లూ డ్యూన్స్ ఆన్ రెడ్ ప్లానెట్’(ఎర్ర గ్రహంపై(అంగారక) నీటి ఇసుక దిబ్బలు) అని క్యాప్షన్ పెట్టింది.

నాసా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందమైన బ్లూ డ్యూన్స్‌ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంగారక గ్రహంపై వీచే బలమైన గాలుల గారణంగా ఇవి ఏర్పడుతాయని నాసా తెలిపింది. ఇక ఈ డ్యూన్స్ అంగారక గ్రహంపై 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు పేర్కొంది.




