- Telugu News Photo Gallery Science photos Some interesting facts about nasa ingenuity helicopter ride on mars
Ingenuity Helicopter: అంగారకుడిపై అద్భుత హెలికాప్టర్.. ‘ఇన్‌జెన్యూటీ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?
Ingenuity Helicopter: అంగారకుడిపై ప్రయోగాలు చేపట్టే క్రమంలో అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'.. పర్సవరెన్స్ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇన్‌జెన్యూటీ పేరుతో ఓ హెలికాప్టర్‌ను అంగారకుడిపైకి పంపించింది..
Updated on: Apr 11, 2021 | 12:34 PM

అంగారక గ్రహంపై మానవ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' అంగారకుడి రహస్యాలను తెలుసుకునేందుకు 'పర్సవరెన్స్' అనే ప్రయోగం చేపట్టింది.

ఈ ప్రయోగంలో భాగంగానే అంతరిక్ష చరిత్రలో తొలిసారి మరో గ్రహంపైకి హెలికాప్టర్‌ను పంపించారు. ఇన్‌జెన్యూటీ పేరున్న ఈ హెలికాప్టర్ అంగారకుడి రహస్యాలను చేధించనుంది.

1.8 కిలోల బరువుండే ఈ మినీ హెలికాప్టర్ రూపకల్పనలో అధునాతన మెటీరియల్స్‌ను ఉపయోగించారు.

హెలికాప్టర్‌కు అమర్చిన రెండు రోటార్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్ ఫైబర్ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. ఈ రోటార్లు నిమిషానికి 2,400 చుట్లు తిరుగుతాయి.

ఇక అంగారక గ్రహంపై పరిశోధనుల చేపట్టడానికి మూడు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్, ఇతర పరికరాలు అమర్చారు. ఒక్కో ప్రయాణంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది.


అమెరికాలోని అలబామాలో ఉండే 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ హెలికాప్టర్‌కు ఈ పేరు పెట్టింది. 'ఇన్‌జెన్యూటీ' అంటే చాతుర్యం, బుద్ధి కుశలత అని అర్థం.




