- Telugu News Photo Gallery Saturn and Jupiter retrograde brings financial benefits to people of four zodiac signs
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
జూలై నెలలో ఐదు రాశుల వారికి అదృష్టం కలగనుంది. ఎందుకంటే? ఈ మాసంలో బృహస్పతి , శని గ్రహాల తిరోగమనం చేయడం వలన ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, ఐదు రాశుల వారికి మాత్రం అదృష్టం తీసుకొస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తిరోగమనం ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలిగించడమే కాకుండా విశేష ప్రయోజనాలు చేకూరుస్తుదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 09, 2025 | 2:13 PM

మిథున రాశి : మిథున రాశి వారు ఆర్థికంగా చాలా బలవంతులవుతారు. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ఏ పరీక్షల్లోనైనా విజయం ఈ రాశి వారిదే అవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

Shani Thirogamanam5

వృషభ రాశి : వృషభ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగంలో చేరాలని కలలు కంటారో వారి కల సాకరం అవుతుంది. మొండి బాకీలు వసూలు అవ్వడం వీరికి చాలా సంతోషాన్నిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతారణం నెలకొంటుంది. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే ఛాన్స్ ఉంది.

Shani Thirogamanam2

సింహ రాశి : ఈ రాశి వారికి శని, బృహస్పతిల తిరోగమనం వలన వీరు ధనసంపన్నులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.



