AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం స్పెషల్ పిండి దీపం పూజ.. సంపద, సుఖసమృద్ధికి గ్యారంటీ రహస్యం!

Saturday Rituals for Wealth: శనివారం అత్యంత పవిత్రమైన రోజు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాన్ని శనివారం వెలిగించడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. అప్పుల సమస్యలు తీరడం, ఆస్తిపాస్తులు వృద్ధి చెందడం, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం వంటి అనేక ప్రయోజనాలను శనివారం పాటించే ఈ ప్రత్యేక నియమాలు అందిస్తాయి.

Rajashekher G
|

Updated on: Apr 24, 2026 | 10:26 PM

Share

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు లభిస్తాయి. శనివారం చేసే పూజలు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, శనివారం చెప్పబడిన నియమాలను పాటిస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోయి, ఊహించలేనంత ఐశ్వర్యం పొందవచ్చు. పిండి దీపం అత్యంత శక్తివంతమైన దీపాలలో ఒకటి. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. పిండి దీపాన్ని తయారు చేయడానికి బియ్యప్పిండి, బెల్లం తురుము, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీళ్లు పోసి చపాతి ముద్దలా కలపాలి. ఈ పిండితో ప్రమిదను తయారుచేసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఏడు వత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని నమ్మకం.

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు లభిస్తాయి. శనివారం చేసే పూజలు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, శనివారం చెప్పబడిన నియమాలను పాటిస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోయి, ఊహించలేనంత ఐశ్వర్యం పొందవచ్చు. పిండి దీపం అత్యంత శక్తివంతమైన దీపాలలో ఒకటి. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. పిండి దీపాన్ని తయారు చేయడానికి బియ్యప్పిండి, బెల్లం తురుము, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీళ్లు పోసి చపాతి ముద్దలా కలపాలి. ఈ పిండితో ప్రమిదను తయారుచేసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఏడు వత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని నమ్మకం.

1 / 5

శనివారం పాటించాల్సిన నియమాలు: 

తలస్నానం: శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం శుభప్రదం. నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. 
పూజ గది శుభ్రత: శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని, దేవుని పటాలకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి.

శనివారం పాటించాల్సిన నియమాలు: తలస్నానం: శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం శుభప్రదం. నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. పూజ గది శుభ్రత: శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని, దేవుని పటాలకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి.

2 / 5

తులసి దళాలు: వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి. శనివారం దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి, కష్టాలు తీరుతాయి.
నైవేద్యం: పూజలో చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించినా స్వామివారు ఎంతో సంతోషిస్తారు. 
అప్పుల నివారణ: అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను దారానికి గుచ్చి మాలగా చేసి శనివారం వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అప్పులు తీరి, జీవితంలో ధన కొరత ఉండదు.

కాకికి అన్నం: కాకికి అన్నం పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది, ధనపరంగా కలిసి వస్తుంది. 
రావి చెట్టు పూజ: సొంత ఇంటి కల, భూములు కొనే ఆశ ఉన్నవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, 11 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరి, ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఒక రావి ఆకును బీరువాలో పెట్టుకుంటే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

తులసి దళాలు: వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి. శనివారం దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి, కష్టాలు తీరుతాయి. నైవేద్యం: పూజలో చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించినా స్వామివారు ఎంతో సంతోషిస్తారు. అప్పుల నివారణ: అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను దారానికి గుచ్చి మాలగా చేసి శనివారం వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అప్పులు తీరి, జీవితంలో ధన కొరత ఉండదు. కాకికి అన్నం: కాకికి అన్నం పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది, ధనపరంగా కలిసి వస్తుంది. రావి చెట్టు పూజ: సొంత ఇంటి కల, భూములు కొనే ఆశ ఉన్నవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, 11 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరి, ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఒక రావి ఆకును బీరువాలో పెట్టుకుంటే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

3 / 5

లక్ష్మీదేవి ఆకర్షణ: చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం కొత్త చీపురు కొంటే ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పాత చీపురును శనివారం బయట పడేయకూడదు. తమలపాకులను ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సిరిసంపదలు అందిస్తుంది.
ఆంజనేయ స్వామి పూజ: ప్రతి శనివారం ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి.
ముద్ద కర్పూరం: ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది.
ధనయోగం:పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఒక శనివారం ఐదు యాలకులను పర్సులో పెట్టుకోవాలి.
ఆరోగ్యం: అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలు చదవడం లేదా ఓం గోవిందాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

లక్ష్మీదేవి ఆకర్షణ: చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం కొత్త చీపురు కొంటే ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పాత చీపురును శనివారం బయట పడేయకూడదు. తమలపాకులను ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సిరిసంపదలు అందిస్తుంది. ఆంజనేయ స్వామి పూజ: ప్రతి శనివారం ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి. ముద్ద కర్పూరం: ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది. ధనయోగం:పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఒక శనివారం ఐదు యాలకులను పర్సులో పెట్టుకోవాలి. ఆరోగ్యం: అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలు చదవడం లేదా ఓం గోవిందాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

4 / 5
నివారించాల్సినవి: శనివారం నూనె, ఉప్పు కొనకూడదు. కొత్త బట్టలు కొనడం, నలుపు రంగు వస్త్రాలు ధరించడం దరిద్రానికి కారణమవుతాయి. నీలం రంగు వస్త్రాలు ధరించడం అదృష్టాన్ని తీసుకొస్తుంది. 
ఏలినాటి శని దోష నివారణ: ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే దోషాలు తొలగి, అదృష్టం పెరుగుతుంది. 
ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పొందవచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

నివారించాల్సినవి: శనివారం నూనె, ఉప్పు కొనకూడదు. కొత్త బట్టలు కొనడం, నలుపు రంగు వస్త్రాలు ధరించడం దరిద్రానికి కారణమవుతాయి. నీలం రంగు వస్త్రాలు ధరించడం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఏలినాటి శని దోష నివారణ: ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే దోషాలు తొలగి, అదృష్టం పెరుగుతుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పొందవచ్చు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us