AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: టికెట్ క్యాన్సలేషన్ రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన

రైల్వే రీఫండ్ నిబంధనలలో చేసిన మార్పులు ప్రయాణికులకు అదనపు భారం అని జరుగుతున్న ప్రచారంపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్ రీఫండ్ విధానంలో పారదర్శకత తీసుకురావడంలో భాగంగా, రైల్వే శాఖ ప్రయాణికులకు ముందుగానే తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలింది. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముందుగానే సమాచారం తెలుస్తుందని పేర్కొంది.

Anand T
|

Updated on: Mar 25, 2026 | 1:56 PM

Share
ముందస్తు స్పష్టత: ప్రయాణికులకు వారి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో సకాలంలో తెలియజేసే పారదర్శక చర్యలో భాగంగా, చార్ట్ తయారీ సమయాన్ని రైలు బయలుదేరడానికి 4 గంటల నుండి 9 నుంచి18 గంటలకు పెంచినట్టు అని పేర్కొంది. దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు తమ ప్రయాణంపై ముందస్తుగా స్పష్టత వస్తుందని తెలిపింది.

1 / 5
అదనపు ఖర్చు లేదు: ప్రయాణికులు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే క్రమంలో చార్ట్ తయారీ సమయాలను మార్చడంతో పాటు, రీఫండ్ నిబంధనలను కూడా సవరించినట్టు రైల్వే శాఖ పేర్కొంది. దీని కోసం ప్రయాణికులు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

2 / 5
అక్రమాలపై నియంత్రణ: రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ పారదర్శక సంస్కరణ ప్రయాణికులకు మేలు చేయడమే కాకుండా, అక్రమ టికెట్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సహాయపడుతాయని పేర్కొంది. ఇది ఒక రకంగా ప్రయాణికులు మేలు చేసే నిర్ణయమేనని తెలిపింది.

3 / 5
బోర్డింగ్ పాయింట్ మార్పు: రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరడానికి చివరి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకావం ఉంది.

4 / 5
అంతేకాదు ఒక వేళ ట్రైన్‌లో సీట్లు అందుబాటులో ఉంటే, రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోగిని అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ సంస్కరణలు ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.

5 / 5
Follow Us