- Telugu News Photo Gallery Political photos PM Narendra Modi casts his vote in Gujarat Assembly Election second phase in Ahmedabad Telugu Political Photos
Gujarat Elections: అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ – PM Modi Photos
గుజరాత్ రెండో దశ ఎన్నికలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో కూడా ప్రధాని మోదీ ఓటు వేశారు.
Updated on: Dec 05, 2022 | 11:06 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్‌లో ఆయన ఓటు వేశారు. ఓటింగ్ వెళ్తున్న సమయంలో ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి నంబర్ వచ్చిన తర్వాత ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాను.

ముందుగా ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. రెండో దశకు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని గుజరాత్ ప్రజలను, ముఖ్యంగా మహిళలు, యువతను నేను అభ్యర్థించారు.

అనంతరం కాలినడకనే తన అన్న సోమాభాయ్ ఇంటికి చేరుకున్నారు. పోలింగ్ బూత్ ఉన్న చోటుకు కేవలం 200 మీటర్ల దూరంలోనే సోమాభాయ్ మోదీ ఇల్లు ఉంది.

Google's Year in Search 2022: List of Top trending searches in India and around the world

కానీ ఆయన కుటుంబం మాత్రం ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరు లైమ్ లైట్‌కు దూరంగా సామాన్యుడిలా జీవిస్తున్నారు.

వీరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నలు, తమ్ముళ్లు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ అన్నయ్య సోమాభాయ్ గుజరాత్‌లో వృద్ధుల సంరక్షణ కోసం ఓ సంస్థను నడుపుతున్నారు.

దీనికి సంబంధించిన పీఎం మోడీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన పీఎం మోడీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.





























