- Telugu News Photo Gallery Not getting enough sleep at night or the chances of diabetes are high, check here is details in Telugu
Diabetes Risk: రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే షుగర్ పొంచి ఉన్నట్టే!
నిద్రకి మనిషి ఆరోగ్యానికి సంబంధం ఉంది. రాత్రి పూట హాయిగా నిద్ర పోతున్నారంటే.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే. సరిగా నిద్ర పోవడం లేదంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నిద్ర కూడా ఒకటి. రోజంతా ఎంత పని చేసినా రాత్రి పూట సరిగ్గా నిద్రపోక పోతే ఆ ఎఫెక్ట్.. ఆరోగ్యంపై ఖచ్చితంగా పడుతుంది. రాత్రి వేళ సరిగా నిద్ర పోకపోతే డయాబెటీస్‌తో ముడి పడి ఉంటుందని..
Updated on: Jul 28, 2024 | 12:53 PM

నిద్రకి మనిషి ఆరోగ్యానికి సంబంధం ఉంది. రాత్రి పూట హాయిగా నిద్ర పోతున్నారంటే.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే. సరిగా నిద్ర పోవడం లేదంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నిద్ర కూడా ఒకటి.

రోజంతా ఎంత పని చేసినా రాత్రి పూట సరిగ్గా నిద్రపోక పోతే ఆ ఎఫెక్ట్.. ఆరోగ్యంపై ఖచ్చితంగా పడుతుంది. రాత్రి వేళ సరిగా నిద్ర పోకపోతే డయాబెటీస్‌తో ముడి పడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రకు ఆరోగ్యానికి లోతైన సంబంధం ఉందంటున్నారు నిపుణులు.

ప్రతి రోజూ రాత్రి వేళ 7 లేదా 9 గంటలైనా కనీసం పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజులు అయితే పర్వాలేదు. కానీ మరిన్ని ఎక్కువ రోజులు ఇలా నిద్ర సమస్యను ఎదుర్కుంటే.. ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి.

అలాగే ఎవరైతే ఎక్కువగా తక్కువగా నిద్ర పోతూంటారో వారిలో డయాబెటీస్ ముప్పు మరింత అధికంగా ఉంటుందట. ఎక్కువగా నిద్రించే వారిలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ 34 శాతం పెరిగింది. అదే నిద్ర తక్కువ అయితే బీపీ, షుగర్, అధిక బరువు, ఒత్తిడి, గుండె వ్యాధుల సమస్యలు పెరుగుతాయి.

మీరు కూడా ఒకసారి మీ నిద్ర పరిస్థితిని గమనించుకోండి. ముందుగా ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు ట్రై చేయాలి. కానీ మీ నిద్రలో ఎలాంటి మార్పులు లేకపోతే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.




