- Telugu News Photo Gallery Cricket photos BCCI and IPL owners set to meet on July 31, decision likely on retentions and RTM for IPL 2025 mega auction
IPL 2025: 4 రిటైన్‌లు, 2 RTMలు.. రూ.120 కోట్లు పర్స్ వాల్యూ.. ఫ్రాంచైజీలకు మైండ్ బ్లాంక్ అయ్యే ఛాన్స్.!
ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు స్వదేశీ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్స్ ఉండనున్నట్టు సమాచారం. ఆ వివరాలు ఇలా..
Updated on: Jul 28, 2024 | 3:14 PM

ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించనున్నట్టు తెలుస్తోంది.

ఇందులో నలుగురు స్వదేశీ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్స్ ఉండనున్నట్టు సమాచారం. ఈ నెల 31న జరిగే బీసీసీఐ- ఐపీఎల్ సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది.

అయితే ఎనిమిది మంది ఆటగాళ్లను రిటెన్షన్ చేయాలని ఫ్రాంచైజీలు కోరుతుండగా.. అంతమందిని రిటెన్షన్ చేస్తే మెగా వేలం చప్పగా సాగుతుందని బీసీసీఐ భావిస్తోందట.

అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఇప్పటిదాకా ఫ్రాంచైజీల ప్లేయర్స్ క్యాప్ రూ. 90 కోట్లు ఉండగా.. ఆ మొత్తాన్ని రూ. 120 కోట్లకు పెంచనున్నట్టు సమాచారం.

ఇక రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్టులో మొదటి ఆటగాడికి రూ. 14 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ 10 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 8 లేదా 6 కోట్లు.. ఇక రైట్ టూ మ్యాచ్‌లో తీసుకునే ఇద్దరికి రూ. 2 నుంచి 4 కోట్లు ఫ్రాంచైజీ వెచ్చించనుందని టాక్.




