- Telugu News Photo gallery Not a Flight you can also go abroad from these railway stations in india Telugu News
Indian Railways: విదేశాలకు వెళ్లాలంటే విమానంలోనే కాదు..! ఇండియన్ రైల్వేలో కూడా ప్రయాణించవచ్చు.. ఆ రైల్వే స్టేషన్లు ఇవే..
విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అయితే, విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే విమాన ప్రయాణ ఖర్చులే మనందరినీ భయపెడుతుంటాయి. ట్రైన్‌లో ప్రయాణించి కూడా విదేశాలకు వెళ్లే ప్రాంతాలు మన దేశంలో అనేకం ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. పొరుగు దేశాల సరిహద్దులలో ఉన్న మనదేశంలోని సరిహద్దు ప్రాంతాల నుండి ఇది సాధ్యమవుతుంది.
Updated on: Apr 25, 2023 | 3:06 PM

Bandhan Express Train- కోల్‌కతా రైల్వే స్టేషన్ నుండి బంగ్లాదేశ్ వెళ్లే బంధన్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది. ఈ రైలు ద్వారా బంగ్లాదేశ్ వెళ్లవచ్చు. అయితే, ఈ రైలులో భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య ప్రయాణించడానికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా అవసరం.

Jayanagar Railway Station- జయనగర్ రైల్వే స్టేషన్ బీహార్‌లోని మధుబని జిల్లాలో ఉంది, ఈ రైల్వే స్టేషన్ ఇండో-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ స్టేషన్ జనక్‌పూర్ వద్ద కుర్తా స్టేషన్ ద్వారా నేపాల్‌కు అనుసంధానించబడి ఉంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య భారతదేశం-నేపాల్ సరిహద్దు ప్యాసింజర్ రైలు నడుస్తుంది. రైలు సర్వీస్ ఇటీవలే పునఃప్రారంభించబడింది. రెండు దేశాల ప్రజలు రైలు ఎక్కేందుకు పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం లేదు.

Mitali Express- భారతదేశం నుండి ఢాకాకు వెళ్లాలనుకునే వారు మిథాలీ ఎక్స్‌ప్రెస్‌లో న్యూ జల్‌పైగురి జంక్షన్ నుండి ప్రయాణించవచ్చు. హల్దీబారి రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 4.5 కి.మీ, భారత సరిహద్దు నుండి 7 కి.మీ దూరంలో ఉంది. దూరంగా ఉన్న చిల్హతి రైల్వే స్టేషన్ ద్వారా ఇది బంగ్లాదేశ్‌కు అనుసంధానించబడి ఉంది.

Radhikapur Railway Station- రాధికాపూర్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఉంది. ఇది కతిహార్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. రాధికాపూర్ రైల్వే స్టేషన్ జీరో పాయింట్ రైల్వే స్టేషన్. ఈ రైలు మార్గం బంగ్లాదేశ్‌లోని బిరల్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానించబడి ఉంది. ఇది ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో యాక్టివ్ ట్రాన్సిట్ స్టేషన్‌గా పనిచేస్తుంది. ఈ సరిహద్దు రైల్వే స్టేషన్ సాధారణంగా అస్సాం, బీహార్ నుండి బంగ్లాదేశ్‌కు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.

Singhabad Railway Station- సింగాబాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ రోహన్‌పూర్ స్టేషన్ ద్వారా బంగ్లాదేశ్‌కు అనుసంధానించబడి ఉంది. అలాగే, బంగ్లాదేశ్ నుండి నేపాల్ చేరుకోవడానికి గూడ్స్ రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. పాత మాల్దా స్టేషన్ నుండి ఈ స్టేషన్‌కు ఒక ప్యాసింజర్ రైలు మాత్రమే వెళుతుంది. అయితే, ఈ సరిహద్దు రైల్వే స్టేషన్ ఈ రెండు ప్రాంతాల మధ్య వస్తువుల ఎగుమతి, దిగుమతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.





























