Nitin Gadkari: ఈ ఏడాది చివరినాటికి గుంతలు లేని జాతీయ రహదారులు చేస్తాం.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది చివరినాటికి దేశంలో అన్ని జాతీయ రహదారులపై ఎలాంటి గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇందుకు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా విధి విధానాలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఇదివరకే.. 1,46,000 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల మ్యాపింగ్ ప్రక్రియ పూరైనట్లు పేర్కొన్నారు. అలాగే త్వరలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి అవసరమైనటువంటి.. నిర్వహణ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు వెల్లడించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
