- Telugu News Photo Gallery New year 2024: Bagalkot Teacher Wrote Letter To CM And VIP Person To Wishing New Year And Sankranti
New Year 2024: ఈ టీచర్ రూటే సెపరేట్.. గత 34 ఏళ్లుగా సీఎంలకు, ప్రముఖులకు గ్రీటింగ్స్ ఎలా చెబుతున్నారంటే..
ఆధునిక పద్దతులు మనవ జీవితంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఈజీ ప్రాసెస్ అంటూ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగాన్ని మొదలు పెట్టాడు. దీంతో అనేక పద్దతులు.. మధురానుభుతులను కోల్పోతున్నాడు మనిషి.. అలాంటి ఒక తీపి జ్ఞాపకం ఉత్తరం. మానవ సంబధాలకు నిలయంగా వెలుగొందిన తోకలేని పిట్ట.. సెల్ ఫోన్ వాడుకలోకి వచ్చిన తర్వాత కనుమరుగై పోయింది. తన అస్తిత్వాన్ని కోల్పోయి పాత తరం వారికీ తీపి జ్ఞాపకంగా మారిపోయింది. అలాంటి ఉత్తరాన్ని నేటికీ ఓ టీచర్ ఉపయోగిస్తున్నారు.
Updated on: Dec 26, 2023 | 2:02 PM

ఆధునిక సమాచార వ్యవస్థలు అలవాటైన తర్వాత అస్థిత్వాన్ని కోల్పోయిన ఉత్తరంతో ఓ టీచర్ నేటికీ ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మానవ సంబంధాలకు వారధిగా నిలిచిన ఉత్తరాన్ని ఇంకా ఉపయొగిస్తూ వార్తల్లో నిలిచారు కర్నాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు.

బాగల్‌కోట్ జిల్లా బనహట్టి తాలూకా మదనమట్టి గ్రామానికి చెందిన ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బసవరాజు నేటికీ ఉత్తరాలను ఉపయోగిస్తున్నారు. ఉత్తరాల ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా ఈ ఉపాధ్యాయుడు గత 34 ఏళ్లుగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అనేక మంది ప్రముఖులకు, అన్ని జిల్లాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులకు శుభాకాంక్షలను ఉత్తరాల ద్వారానే నేటికీ తెలియజేస్తున్నారు.

వీఐపీలకు మాత్రమే కాదు తన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులకు, వివిధ రంగాల నేతలకు కూడా లేఖల ద్వారానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దివ్యాంగుడైన బసవరాజు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా విధులను నిర్వహిస్తున్నాడు. బసవరాజు 1989 నుంచి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. మొదట్లో 100-200 మందికి ఉత్తరాలు రాసేవాడు.

అయితే ఇప్పుడు ఆయన రాసే లెటర్స్ సంఖ్య వేలకు చేరుకుంది. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ రాసే లెటర్స్ సంఖ్య దాదాపు రెండు వేలకు చేరుకుంది.

2023 నూతన సంవత్సరంలో కూడా న్యు ఇయర్ గ్రీటింగ్స్ ను లెటర్ ద్వారానే తెలియజేశారు ఉపాధ్యాయుడు బసవరాజ్. ఇలా గ్రీటింగ్స్ ని తెలియజేస్తూ లెటర్స్ ను కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కూడా పంపించారు.

అయితే 2023కి గుడ్ బై చెప్పి.. మరో ఆరు రోజుల్లో కొత్త సంవత్సరం 2024కి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్న నేపధ్యంలో బసవరాజు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్స్ ను రాశారు. ఈ విషయంపై బసవరాజు స్పందిస్తూ.. తన హాబీ చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. అంతేకాదు తండ్రి చంద్రశేఖరుడు, పెద్దనాన్నలే తనకు ఉత్తరాలు రాయడానికి స్ఫూర్తినిచ్చారన్నారని వెల్లడించారు.





























