Mother’s Day Special: అమ్మకు ప్రేమతో.. ఈ యువకుడి టాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే..

| Edited By: Srikar T

May 12, 2024 | 1:12 PM

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా..అంటూ తల్లి ప్రేమను అద్భుతంగా వర్ణించాడు ఓ సినీ కవి..! మనకు సృష్టిని పరిచయం చేసింది అమ్మ అయితే .. సృష్టి మనకు ఇచ్చిన గొప్ప కానుక అమ్మ. అటువంటి అమ్మకు ఏమిచ్చినా తక్కువే..! అందుకే అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు తల్లిపై ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బిడ్డను లాలించే తల్లి ప్రేమ కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.

1 / 5
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా..అంటూ తల్లి ప్రేమను అద్భుతంగా వర్ణించాడు ఓ సినీ కవి..! మనకు సృష్టిని పరిచయం చేసింది అమ్మ అయితే .. సృష్టి మనకు ఇచ్చిన గొప్ప కానుక అమ్మ.

2 / 5
అటువంటి అమ్మకు ఏమిచ్చినా తక్కువే..! అందుకే అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా  ఓ సూక్ష్మ కళాకారుడు తల్లిపై ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బిడ్డను లాలించే తల్లి ప్రేమ కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.

3 / 5
కేవలం పది మిల్లీమీటర్ల ఎత్తులో దీనిని రూపొందించడం రికార్డ్ అని చెప్పాలి. ఇతనిలోని ప్రతిభను, కళను చూసిన వారంతా శభాష్ అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్.. అమెరికాలో నివాసం ఉంటున్నాడు.

4 / 5
సందర్భానికి అనుసారం సూక్ష్మ కళాకారులు చేయడం అతనికి అలవాటు. పది మిల్లీ మీటర్ల ఎత్తు, 6మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ తయారు చేశాడు వెంకటేష్. ఇంతటి గొప్ప రూపాన్ని తీసుకురావడానికి రెండు గంటల పాటు శ్రమించానని చెప్పాడు.

5 / 5
ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించి తల్లికి అంకితం చేస్తానని టీవీ 9తో అన్నారు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‎తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు వెంకటేష్. ఈ సారి మాతృదినోత్సవం సందర్భంగా తన మాతృ ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు.