- Telugu News Photo Gallery Many problems can be checked with just one neem, Check Here is Details in Telugu
Neem Leaves: ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే ఈ చెట్టును పూజిస్తారు. వేపాకు చెట్టు గాలి రోజూ పీల్చినా కూడా ఎన్నో శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చెట్టు ఆకులు, కాయలు, బెరడు అన్నీ ఉపయోగకరమైనవే. రోగాలు రాకుండా అడ్డుకోవడంలో వేపాకు సహాయ పడుతుంది..
Updated on: Jan 11, 2025 | 3:34 PM

వేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే వేప చెట్టును దేవతా స్వరూపంగా భావిస్తారు. వేపాకులు, బెరడు, కాయలు.. ఇలా చెట్టులోని అన్నింటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేపాకును సరిగ్గా ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు సైతం వేపాకుల్లో లభిస్తాయి. వేపాకులు నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే.. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సామర్థ్యం ఈ వేపాకుల్లో ఉంది.

జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గుతుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యలతో బాధ పడేవారు. వేపాకులను మరిగించిన నీటిని.. తలస్నానం అనంతరం గోరు వెచ్చగా తలపై నుంచి పోసువాలి. వేపాకు పేస్టును తలపై రాసుకున్నా చుండ్రు, పేలు, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది.

వేప ఆకు శక్తివంతమైన డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. శరీరంలో విషాన్ని తొలగిస్తుంది. అవయవ పనితీరును మెరుగుపరుస్తుంది. వేప ఆకులలో జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. దీని రసం లేదా నూనె వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వేప ఆకులను నమలడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. శరీరం సహజ కాంతి పెరుగుతుంది.




