ఆంటీ మీరు తెలుగేనా..వామ్మో అర్హ, మంచు లక్ష్మిని అంతమాట అనేసింది ఏంటీ!
అల్లు అర్జున్ గారాలపట్టీ అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ముద్దు ముద్దు మాటలు, తన అల్లరితో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ చిన్నారి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఈ చిన్నారి నటి మంచు లక్ష్మిని అనుకోకుండా ఓ మాట అనేసి, ఆటపట్టించింది. ఆమె అన్న మాటకు బన్నీ షాకై నవ్విపోయాడు. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసుకుందాం పదండి!
Updated on: Aug 09, 2025 | 11:20 AM

అల్లు అర్జున్ గారాలపట్టీ అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ముద్దు ముద్దు మాటలు, తన అల్లరితో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ చిన్నారి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఈ చిన్నారి నటి మంచు లక్ష్మిని అనుకోకుండా ఓ మాట అనేసి, ఆటపట్టించింది. ఆమె అన్న మాటకు బన్నీ షాకై నవ్విపోయాడు. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసుకుందాం పదండి!

అల్లు స్నేహ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, అర్హకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అల్లు అర్హ తన క్యూట్ మాటలతో బన్నీని ఆటపట్టించిన వీడియో, తన బ్రదర్‌తో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ వీటన్నింటిని స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ రాములో రాములా హాఫ్ కోట్ డ్యాన్స్ దోశ స్టెప్ అంటూ అర్హ చేసిన అల్లరి మాములుగా ఉండదు. అర్హ మాటలకు అల్లు అర్జు చాలా సంతోషపడే వాడు.

అయితే తాజాగా అర్హ మంచు లక్ష్మీని ఆటపట్టించింది. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్యామిలీ, ముంబైలో ఉన్న మంచు లక్ష్మీ ఇంటికి వెళ్లగా,అక్కడ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందరినీ అల్లరి పట్టింటే అల్లు అర్హ, మంచు లక్ష్మీని కూడా వదల్లేదు. అయితే మంచు లక్ష్మీ, అర్హ ఇద్దరూ ఒక సోఫోలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా, మంచు లక్ష్మీ అర్హ పాప నువ్వు నన్నేదో అడుగుదాం అనుకున్నావంట కదా..ఏంటీ అంటుంది.

దీంతో అర్హ ఒక్కసారిగా నువ్వు తెలుగేనా అని అడుగుతుంది. మంచు లక్ష్మీ షాకై, నేను ఏంటీ, నేను తెలుగా? అని అడగ్గా, ఆంటీ మీరు తెలుగేనా? అని మరోసారి అడుగుతుంది.దీంతో మంచు లక్ష్మీ ఆశ్చర్యపోయి, దానికి సమాధానం ఇస్తూ.. నీకు ఎందుకు అలాంటి డౌట్ వచ్చింది. నేను తెలుగునే పాప, నీతో నేను తెలుగులోనే కదా మాట్లాడింది అంటూ నవ్వింది. దీనికి అల్లు అర్జున్ కూడా షాకైపోతాడు.

తర్వాత అర్హ పాప నీకు ఎందుకు అలా అనిపించింది అంటూ మంచు లక్ష్మీ అడగ్గా, దానికి అర్హ సమాధానం ఇస్తూ.. నీ యాస అలా ఉంటుంది. అందుకే అడిగాను అని చెప్పుకొస్తుంది. మీరి నీ యాస కూడా అలాగే ఉంది కదా అంటూ నవ్వుతూ ముద్దు ఇస్తుంది మంచు లక్ష్మీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక అర్హ మంచు లక్ష్మీని యాస అంటూ ఆటపట్టించడంతో, లక్ష్మీ నవ్వుతూ..బన్నీ నువ్వే ఇలా అడగమంటూ ట్రైనింగ్ ఇచ్చావా అని ప్రశ్నిస్తూ నవ్వేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెట్టింట నవ్వులు పూయిస్తుంది.



