- Telugu News Photo Gallery Make old gold jewelry look like new like this, Check Here is Details in Telugu
Kitchen Hacks: పాత బంగారు నగలను ఇలా కొత్తవాటిలా మార్చేయండి..
ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండటం కామన్. కేవలం పండుగలు, ఫంక్షన్ల సమయంలోనే బంగారు నగలను ఉపయోగిస్తూ ఉంటారు. నగలు ఎక్కువగా పాతవి అయ్యే కొద్ది కాస్త నలుపుదనం వస్తుంది. ఒంటిపై ఉండే చెమట కారణంగా బంగారం నల్లగా మారుతుంది. ఇలా నల్లగా మారిన బంగారు నగలను అమళ్లీ కొత్త వాటిలా మిలమిలమని మెరిపించవచ్చు. ఈ సింపుల్ చిట్కాలతో చాలా సులువుగా ఇంట్లోనే మనం..
Updated on: Sep 25, 2024 | 4:01 PM

ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండటం కామన్. కేవలం పండుగలు, ఫంక్షన్ల సమయంలోనే బంగారు నగలను ఉపయోగిస్తూ ఉంటారు. నగలు ఎక్కువగా పాతవి అయ్యే కొద్ది కాస్త నలుపుదనం వస్తుంది. ఒంటిపై ఉండే చెమట కారణంగా బంగారం నల్లగా మారుతుంది.

ఇలా నల్లగా మారిన బంగారు నగలను అమళ్లీ కొత్త వాటిలా మిలమిలమని మెరిపించవచ్చు. ఈ సింపుల్ చిట్కాలతో చాలా సులువుగా ఇంట్లోనే మనం నగలను క్లీన్ చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నగలపై ఉండే మురికి వదిలించి మళ్లీ కొత్త వాటిలా మార్చడంలో లిక్విడ్ డిటర్జెంట్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ముందుగా నీటిని గోరు వెచ్చగా వేడి చేయాలి. అందులో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కలిపి.. నగలను అందులో ఓ పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేస్తే చాలు.

టూత్ పేస్ట్‌తో కూడా మనం నగలను కొత్తవాటిలా మార్చుకోవచ్చు. కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో టూత్ పేస్ట్ వేసి బాగా కలపండి. ఇందులో నగలను ఓ పది నిమిషాలు ఉంచి.. ఆ నీటితో బ్రష్‌తో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల నగల మురికి పోతుంది.

నిమ్మకాయతో కూడా మనం నగల నలుపుదనాన్ని పోగొట్టవచ్చు. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ ఐదు నిమిషాలు నగలను ఉంచండి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్దితో మురికి పోయి.. తెల్లగా మెరుస్తాయి.




