Prudvi Battula |
Updated on: Mar 01, 2023 | 4:05 PM
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు
తాజాగా ఆమె నటించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ అయిన షెజాదా విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తోన్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామాయణణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ లో విడుదల కానుంది
ఇందులో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కంటే ముందు కృతి సనన్.. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది