- Telugu News Photo Gallery Kitchen Hacks: Effective and necessary kitchen tips you should know While cooking
Kitchen Hacks: మర్చిపోయి వంటలో 2 సార్లు ఉప్పు వేశారా? మరేం పర్వాలేదు.. ఉప్పు ఇలా తొలగించండి
ఒక్కోసారి మర్చిపోయి వంటల్లో రెండు సార్లు ఉప్పు వేయడం లేదంటే చేయి తగిలి ఉప్పు పొరబాటున అధికంగా పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు వంట మొత్తం వృద్ధాగా పారబోయవల్సిన పనిలేదు. ఈ చిన్న చిట్కా తెలిస్తే సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు..
Updated on: Nov 10, 2024 | 1:34 PM

మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా వంటగదిలో చిన్న చిన్న పొరపాట్లు వల్ల వండిన భోజనం అంతా వృధా అవుతుంది. పొరపాటున కొంచెం ఎక్కువ ఉప్పు వేసినా అది పనికిరాకుండా పోతుంది. కానీ కొన్ని చిట్కాల ద్వారా ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఒక్కోసారి మర్చిపోయి కర్రీలో మర్చిపోయి రెండుసార్లు ఉప్పు వేస్తుంటారు. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదు. బదులుగా కొన్ని పచ్చి బంగాళాదుంపలను రెండు ముక్కలుగా కట్ చేసి కూర పాత్రలో వేసి, చిన్న మంటపై వేడి చేయాలి. గరిటెతో కూరను కదిపితే అదనపు ఉప్పు బంగాళాదుంపలు పీల్చేస్తాయి. అప్పుడు మీ వంట రుచిగా ఉంటుంది.

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్ చాలా కాలం పాటు ఉపయోగడం వల్ల పదును తగ్గిపోతుంటాయి. అయితే, బ్లేడ్ మార్చడానికి మీరు దుకాణానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. బదులుగా పొడి బ్లెండర్‌లో కొంచెం ఉప్పు వేపి, మూతపెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలాగే ఉంచి, నీళ్లతో బాగా కడగాలి. ఇలా చేస్తే బ్లేడ్లు మళ్లీ షార్ప్‌గా తయారవుతాయి.

పాలు పొంగి గ్యాస్ చుట్టూ పడటం వల్ల.. గ్యాస్ స్టౌ చాలా మురికిగా మారిపోతుంటుంది. దీనిని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అయితే ఇప్పుడు ఆందోళన చెందల్సిన అవసరం లేదు. చేత్తో గ్యాస్ మీద కొంచెం ఉప్పు చల్లి, ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకుని గుడ్డతో బాగా తుడవాలి. అంతే క్షణాల్లో మీ గ్యాస్ మెరుస్తుంది.

వర్షం పడితే పచ్చి మిర్చి త్వరగా పాడైపోతుంది. కానీ పచ్చి మిరపకాయను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేందుకు చక్కని చిట్కా ఒకటి ఉంది. ముందుగా మరిపకాయలన్నింటికీ తొడిమలు తీసెయ్యాలి. తర్వాత మిరపకాయ మధ్యలో చిన్నగా కట్ చేసి.. అందులో కారం, ఉప్పు, పసుపు వేసి ఎండలో ఆరబెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.




