- Telugu News Photo Gallery Kitchen graden tips: Top These Medicinal Plants easy to Grow in Your Kitchen Garden
Medicinal Plants: ఈ మొక్కలు ఆరోగ్యానికి ఓ వరం.. ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం..
మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా ఇస్తాయి. కొన్ని మొక్కలు ఇంటి గాలిని శుద్ధి చేస్తాయి. మరికొన్ని వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని మనం ఔషధ మొక్కలు అని పిలుస్తాము. ఈ రోజు మనం మీ ఇంటి బాల్కనీలో సులభంగా పెంచుకోగల ఆరు ఔషధ మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Aug 16, 2025 | 11:56 AM

హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఔషధ మూలికలలో రాణి కూడా. ఈ మొక్క రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

పుదీనా దాని తాజాదనానికి ప్రసిద్ధి చెందింది. దీనిని అనేక పానీయాలలో అలాగే ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. పుదీనా ఇచ్చే శారీరక ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పాలంటే.. ఇది తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పుదీనాను పెంచుకోవడం చాలా సులభం.. ఇంట్లో ఏదైనా చిన్న కుండీలోనైనా దీనిని పెంచుకోవచ్చు.

కలబంద మొక్కలో సాటి లేని మేటి అయిన ఔషధ గుణాలున్నాయి. దీనిలో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. గాయాలు, జుట్టుకు చికిత్స చేయడంలో కలబంద ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇంట్లో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం.

కొత్తిమీర.. ధనియాలను కొత్తిమీర పండించడానికి ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఇది అనేక వ్యాధుల నివారణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ కొత్తిమీరను పెంచడం కూడా చాలా ఈజీ. ఇంట్లోని ఒక కుండీలో ధనియాలను వేసినా కొత్తిమీర పెరుగుతుంది.

కరివేపాకు జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు రాలకుండా నిరోధిస్తుంది. మీరు ఈ మొక్కను చాలా మంది తమ ఇళ్ళలో పెంచుకోవడం చూసే ఉంటారు. దీనికి క్రమం తప్పకుండా నీరు పోస్తే చాలా త్వరగా పెరుగుతుంది.

మెంతి ఆకులు కూడా చాలా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మెంతి ఆకులను బాల్కనీలో పెంచుకోవడం చాలా సులభం. మెంతి గింజలు వేస్తే మెంతి మొక్కలు మొలకెత్తుతాయి. ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఇది జుట్టుకు కూడా ఒక వరం లాంటిది. దానిని సరిగ్గా చూసుకుంటే.. చాలా త్వరగా పెరుగుతుంది.




