AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquito Relief Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. దోమల బెడదకి ఫుల్‎స్టాప్..

వర్షాకాలంలో దోమలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి కారణం ఈ సీజన్‌లో గుంతల్లో నీరు నిల్వ ఉండడమే. అంతేకాదు మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే ఉంటుంది. ఈ కారణాల వలన ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి. కనుక వర్షాకాలంలో ఈ మొక్కలను బాల్కనీలో లేదా గార్డెన్‎లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి. ఈరోజు అటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jun 13, 2025 | 10:02 PM

Share
వేప: వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు. అంతేకాదు వేపనూనెను కూడా ఉపయోగిస్తారు. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలో వేప మొక్కను నాటండి. ఇంట్లో స్థలం సమస్య ఉంటే. ఇప్పుడు బోన్సాయ్ వంటి వేప మొక్కలు లభిస్తున్నాయి.

1 / 6
నిమ్మగడ్డి: ఈ మొక్క ఇది దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు,  రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క డెంగ్యూని వ్యాప్తి చేసే దోమల నుండి రక్షించగలదని కూడా నమ్మకం. .

2 / 6
రోజ్మేరీ: ఈ మొక్క లు నర్సరీలో లభిస్తాయి. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్కలో వచ్చే పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.  ఈ పువ్వులు ఇంట్లో పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడానికి ముందుగా పువ్వులను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టాలి.. అప్పుడు ఆ నీటిని పురుగులు రాకుండా చల్లాల్సి ఉంటుంది.

3 / 6
తులసి: ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది. ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

4 / 6
క్యాట్నిప్: పుదీనా ఆకులను పోలి ఉండే ఈ మొక్క ఎండలోనూ, నీడలోనూ బాగా పెరుగుతుంది. ఇది పురుగుమందు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో అలాగే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.

5 / 6
అజెరాటం: ఈ మొక్క క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలు లేత నీలం, తెలుపు పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పువ్వుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన ప్రభావం వల్ల చుట్టుపక్కల దోమలు రావు. ఈ పువ్వులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు.

6 / 6
Follow Us
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..

మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!

వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..

ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!

మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!

18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’

టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం

పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ

పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?మీ పొట్ట ప్రమాదంలో