AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Japan PMs: జపాన్ ప్రధానికి గోల్‌గప్పా పిచ్చపచ్చగా నచ్చేసిందట.. వైరల్ అవుతున్న మోదీ-కిషిధా ఫోటోలు..

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలో అడుగు పెట్టిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరువురు విస్తృతంగా చర్చలు జరిపారు.

శివలీల గోపి తుల్వా
| Edited By: Phani CH|

Updated on: Mar 20, 2023 | 8:51 PM

Share
భేటీ అనంతరం మీడియాతో మోదీ.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి, భారత్ అధ్యక్షతన జరగనున్న జీ20 సదస్సు గురించి కిషిదాతో చర్చించానని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారంపై తమ అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు.

1 / 6
అనంతరం ఢిల్లీలోని బుద్ధజయంతి పార్క్‌లో భారత, జపాన్ ప్రధానులు ఇద్దరూ సరదాగా తిరగాడారు. ఆ సందర్భంగా ఇరువురు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూనే పార్క్ పరిసరాల్లో నడిచారు.

2 / 6
ఆ తర్వాత పార్క్ దగ్గరలోనే ఉన్న గోల్‌గప్పా స్టాల్ వద్దకు చేరుకున్నారు భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని  ఫుమియో కిషిదా. గోల్‌గప్పా తిన్న జపాన్ ప్రధాని.. అది తనకు ఎంతో నచ్చిందని, నాలుక మళ్లీ మళ్లీ కోరుకునే రుచి ఏదో అందులో ఉందని తెలిపినట్లు సమాచారం.

3 / 6
ఇక అంతకముందు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు జపాన్ ప్రధానికి  విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.

4 / 6
ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధమైన తెల్లటి పంచలో రాజీవ్ చంద్రశేఖర్ కనిపించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు కిషిదా పర్యటన చక్కటి అవకాశమని చెప్పుకోవాలి.

5 / 6
మార్చి 2022లో భారత్- జపాన్ మధ్య జరిగిన చివరి శిఖరాగ్ర సమావేశం నుంచి ఢిల్లీ, టోక్యో వరుసగా G20, G7 దేశాలకు అధ్యక్షత వహించాయి. దీంతో జపాన్ ప్రధాని ఈసారి భారత పర్యటనకు ప్రముఖ్యత సంతరించుకుంది.

6 / 6