Walking: వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడం మంచిది. అయితే వాకింగ్ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవడం మంచిదా? వేసుకుని నడవడం మంచిదా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. చాలా మందికి చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉంటుంది. వీరికి చెప్పులు లేకుండా నడవడం సౌకర్యంగా ఉంటుంది. మరికొందరికి..
Updated on: Mar 23, 2025 | 1:00 PM

గంటకు 4 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడిచే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. గంటకు 5–6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల ప్రమాదాన్ని 24% వరకు తగ్గిస్తుంది. గంటకు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడవడం వల్ల ప్రమాదం దాదాపు 39% తగ్గిస్తుంది.

చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలోని కండరాలు సహజంగా కదులుతాయి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మన పాదాలలోని నరాలు మెదడుకు ముఖ్యమైన సమాచారాన్ని పంపుతాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు ఉత్తేజితమై సమతుల్యత పెరుగుపడుతుంది. నడుస్తున్నప్పుడు తుంటి, మోకాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేగంగా నడవడం వల్ల శరీరం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కండరాలలో గ్లూకోజ్ శోషణను పెంచుతుంది. ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రతిరోజూ 20–30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడి, శరీరంలోని మొత్తం కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

పాదాలను రక్షించుకోవడానికి బూట్లు తయారు చేస్తారు. అవి పాదాలను పదునైన వస్తువులు, వేడి ఉపరితలాల నుండి రక్షిస్తాయి. బూట్లలోని ఆర్చ్ సపోర్ట్, కుషనింగ్, షాక్ శోషణ కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. కఠినమైన ఉపరితలాలపై నడుస్తున్నప్పుడు ఇవి మంచి రక్షణను అందిస్తాయి. బూట్లు పాదాలలోకి మురికి, బ్యాక్టీరియా రాకుండా నిరోధిస్తాయి.

బూట్లు వాడటం మంచిదే అయినప్పటికీ, అవి పాదాల కండరాలను బలహీనపరుస్తాయి. ఎక్కువసేపు బూట్లు ధరించడం వల్ల కండరాలు బలాన్ని కోల్పోతాయి. హైహీల్స్ వంటి సరిగ్గా సరిపోని బూట్లు పాదాలపై ఒత్తిడిని పెంచుతాయి. గాయాలకు దారితీస్తాయి.




