- Telugu News Photo Gallery Surprising Health Benefits of Custard Apple for cholesterol and cancer problems
Custard Apple: క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం! కనిపిస్తే అస్సలొదలొద్దు..
ప్రకృతి పసాధించిన అద్భుత ఫలాలలో సీతాఫలం ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన రుచికరమైన పండు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సీతాఫలం ఇష్టంగా తింటారు. దీని గుజ్జు తినడానికి రుచికరంగా ఉంటుంది. రుచికే కాదు ఎన్నో రోగాలను కూడా ఇది తరిమికొడుతుంది..
Updated on: Mar 23, 2025 | 12:46 PM

సీతాఫలం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన పండు. చాలా మంది ఇష్టపడే పండ్లలో సీతాఫలం ఒకటి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సీతాఫలం తినవచ్చు. దీని గుజ్జు తినడానికి రుచికరంగా ఉంటుంది.

సీతాఫలం కొలెస్ట్రాల్, క్యాన్సర్ సమస్యలకు దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలలో సాధారణంగా కనిపించే మార్నింగ్ సిక్‌నెస్, వికారం, వాంతులు, శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మానసిక మార్పులకు సీతాఫలం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే, పొటాషియం పుష్కలంగా ఉండే ఈ పండు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఫైబర్ అధికంగా ఉండే సీతాఫలం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో అధికంగా ఐరన్ ఉంటుంది. అందువల్ల, రక్తహీనత ఉన్నవారు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవాలి.

సీతాఫలం శరీరానికి విటమిన్ సి అందించి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోషకాలను అందిస్తుంది. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది అనేక రకాల గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.





























