- Telugu News Photo Gallery Is drinking coffee every day beneficial? Harmful? This is what happens in the body
రోజూ కాఫీ తాగడం లాభమా.? నష్టమా.? శరీరంలో జరిగేది ఇదే..
కాఫీని ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం.. ప్రతి రోజూ ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా కొంత మందికి ఉదయం లేచిన వెంటనే కప్పు కాఫీ తాగనిదే అసలు ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటుంటారు.ఇంకొంత మంది మధ్యాహ్నం తాగుతుంటారు. అయితే అసలు కాఫీ ఏ టైమ్ లో తాగాలి. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం.
Updated on: Nov 03, 2025 | 4:22 PM

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. కొందరు రోజులో ఒకసారి కాఫీ తాగితే, మరికొందరు కనీసం రోజులో రెండు లేదా మూడు సార్లు ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. అయితే తాజాగా కాఫీ గురించి వైద్యులు షాకింగ్ విషయాలు వెళ్లడించారు. కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది మన శరీరంలోకి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందంట. అలాగే కాఫీ తాగడం వలన చురుకుదనం పెరగడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నయాంట.

అయితే కొంత మంది చాలా ఇష్టంగా మధ్యాహ్నం కాఫీ తాగుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఎందుకంటే. చాలా మందికి తిన్న తర్వాత ఎక్కువగా నిద్ర వస్తుంటుంది.

కాఫీతో ద్రాక్షపండు, నారింజ వంటి సిట్రస్ పండ్లను కలపవద్దు. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఎర్ర మాంసం తింటే, పొరపాటున కాఫీ తాగకూడదు. దీనివల్ల మాంసం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. ఎర్ర మాంసం ఐరన్ శోషణలో కూడా సమస్యలు వస్తాయి.

కాఫీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అంతే కాకుండా దాని వలన మూడ్ సెట్ అవుతుంది. మూడ్ ఆఫ్‌కు కాఫీ మంచి ఔషధంగా పని చేస్తుంది. చాలా మంది డల్‌గా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో చిన్న కప్పు కాఫీ తాగినా కూడా మూడ్ సెట్ అవుతుంది. అంతే కాకుండా అది చాలా ఉత్సాహంగా ఉంటుందంట.

కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు ప్రతి ఇంట్లో కాఫీ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.




