- Telugu News Photo Gallery If you get these symptoms when you wake up in the morning it means kidney failure, Check Here is Details
Kidney Health: ఉదయం లేవగానే ఈ లక్షణం కనిపిస్తే.. కిడ్నీలు ఫెయిల్ అయినట్టే..
కిడ్నీల్లో సమస్యలు ఉన్నప్పుడు అనేక లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటేనే సరిగ్గా పని చేస్తాయి. లేదంటే ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. ఉదయం మీరు లేచినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే లేట్ చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం మేలు..
Updated on: Jan 27, 2025 | 1:52 PM

శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు సరిగా పని చేస్తేనే శరీరం అన్ని పనులను సరిగా నిర్వర్తిస్తుంది. శరీరంలో మలినాల, వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపడంలో మూత్ర పిండాలు కీలకంగా పని చేస్తాయి. కిడ్నీలు సరిగా పని చేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

చిన్న సమస్యలే కనిపించినా.. వీటిని పట్టించుకోకపోతే మాత్రం తీవ్రంగా మారతాయి. ఉదయం లేవగానే చలిగా అనిపించి లేవాలనిపించకపోవడం. ఈ లక్షణం కిడ్నీల వైఫల్యం కావచ్చు. ఇలా తరుచుగా ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మేలు.

అలాగే ఉదయం లేచిన తర్వాత శరీరం దురదగా అనిపించడం కూడా మూత్ర పిండాల ఎఫెక్ట్ కావచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా అయి ఉండొచ్చు. కాళ్లు, చేతుల్లో వాపులు ఎక్కువగా కనిపించినా డాక్టర్లను కలవాలి.

మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి అనడానికి మరొక లక్షణం మూత్రం. మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు కలర్ మారినా, ఎక్కువగా నురగ వచ్చినట్టు కనిపించినా కిడ్నీలు ఆరోగ్యం సరిగా లేనట్టే.

కడుపులో, వెన్ను పక్కల ఎక్కువగా నొప్పి అనిపించినా, యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పిగా ఉన్నా.. ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవాలి. కిడ్నీల్లో రాళ్ల సమస్య అయి కూడా ఉండొచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























