అధిక కొలెస్ట్రాల్ ఆయుష్షును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేకొద్దీ, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, పక్షవాతం వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. చాలా సార్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినా త్వరగా అర్థం కాదు. కాళ్లు తిమ్మిరి, కనురెప్పలపై పసుపు రంగు మచ్చలు, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించినా చాలా మంది పట్టించుకోరు. నిజానికివి ఇవి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు.