AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గడం ఇక చిటికెలో పని.. రోజూ ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే నెలలో ఊహించని రిజల్ట్..

పెరుగుతున్న బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు.. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. జిమ్‌లకు వెళ్లడానికి సమయం లేక, కఠినమైన డైట్ చేయలేక ఇబ్బంది పడేవారికి ప్రకృతి సిద్ధమైన ఒక అద్భుత పరిష్కారం ఉంది. అదే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు. మన వంటగదిలో దొరికే ఈ పదార్థాలతో కేవలం ఒక నెలలోనే ఆశ్చర్యకరమైన మార్పులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డ్రింక్ శరీరంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: May 12, 2026 | 8:45 AM

Share
నిమ్మ తేనె మ్యాజిక్ : ఈ డ్రింక్ తాగగానే అది శరీరంలోని వివిధ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. నిమ్మరసం, తేనె కలయిక శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా ప్రభావితం చేసి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల విశ్రాంతి సమయంలో కూడా మీ శరీరం ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. రాత్రంతా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడంలో లివర్‌కు ఈ పానీయం తోడ్పడుతుంది.

1 / 5
బోనస్ ప్రయోజనాలు: ఈ అలవాటు వల్ల కేవలం కిలోలు తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. నిమ్మకాయలోని విటమిన్ సి, తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి, మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని అందిస్తాయి.

2 / 5
సరైన పద్ధతి: చాలా మంది వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు, కానీ అది తప్పు. నీటిని గోరువెచ్చగా మాత్రమే ఉంచాలి. మరీ వేడిగా ఉంటే తేనెలోని ఔషధ గుణాలు నశిస్తాయి. వీలైనంత వరకు కల్తీ లేని, స్వచ్ఛమైన సేంద్రియ తేనెను వాడండి. చక్కెర కలిపిన తేనె వల్ల ప్రయోజనం ఉండదు. అర చెక్క నిమ్మరసం సరిపోతుంది. మరీ ఎక్కువగా వాడితే పంటి ఎనామిల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గటగటా తాగేయకుండా చిన్న చిన్న గుటకలతో తాగడం వల్ల లాలాజలంతో కలిసి అది జీర్ణక్రియకు మరింత బాగా సహాయపడుతుంది.

3 / 5
మీ జీవనశైలిలో చేయాల్సిన మార్పులు: కేవలం ఈ పానీయం తాగి కూర్చుంటే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దీనికి తోడుగా 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా జిమ్, యోగా వంటివి చేయాలి.  జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలను తగ్గించి.. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం స్థిరంగా ఉంటుంది.

4 / 5
ఎవరు జాగ్రత్తగా ఉండాలి: నిమ్మరసంలోని ఎసిడిటీ వల్ల పళ్లు సెన్సిటివ్‌గా మారే అవకాశం ఉంది. తాగిన తర్వాత నోటిని మామూలు నీటితో పుక్కిలించడం మంచిది. అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకూడదు. తేనెలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే దీనిని తీసుకోవాలి.  (గమనిక : ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య పరిస్థితికి చికిత్స, ఆహార మార్పుల కోసం  ఆరోగ్య నిపుణుల సలహా తప్పనిసరి.)

5 / 5
Follow Us