- Telugu News Photo Gallery How to Get More Views and Subscribers on YouTube, You need to follow these tips
Youtube: యూట్యూబ్‌లో ఈ 4 ట్రిక్స్ గురించి తెలుసా..? ఇలా చేస్తే మీ వీడియోలకు మస్త్ వ్యూస్..
మీకు యూట్యూబ్ అకౌంట్ ఉందా..? మీ వీడియోస్‌కు ఎక్కువ వ్యూస్ రావాలని కోరుకుంటున్నారా..? అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ముఖ్యంగా 4 విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో వ్యూస్ రావడానికి అవి చాలా ముఖ్యం. ఆ టిప్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Sep 01, 2025 | 3:34 PM

ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఆదాయం, పాపులారిటీ సంపాదించడానికి కూడా ఒక గొప్ప మార్గంగా మారింది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ అన్నీ వైరల్ అవ్వవు. మీ వీడియోలు ఎక్కువ మందికి చేరి, వైరల్ కావాలని మీరు కోరుకుంటే.. కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించడం అవసరం.

ప్రత్యేక కంటెంట్: మీ వీడియో కంటెంట్ ప్రత్యేకంగా, నాణ్యతతో, ప్రేక్షకులకు ఉపయోగపడేలా ఉంటే వైరల్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. వీడియోలో ప్రజలకు అవసరమైన సమాచారం, వినోదం లేదా ఒక ప్రత్యేకమైన సందేశం ఉండేలా చూసుకోండి. వేరేవాళ్ల కంటెంట్‌ను కాపీ-పేస్ట్ చేయడం పూర్తిగా మానేయండి. మీరు చేసే కంటెంట్‌లో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు మీ వీడియో చూడడానికి ఆసక్తి చూపిస్తారు.

వీడియో అప్‌లోడ్ : మీ వీడియోను సరైన సమయంలో అప్‌లోడ్ చేయడం చాలా ముఖ్యం. మీ ప్రేక్షకులు ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో ఉండే సమయంలో వీడియోను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి. యూట్యూబ్ అల్గోరిథం కోసం వీడియో అప్‌లోడ్ చేసిన మొదటి 24 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో ఎక్కువ వీక్షణలు, లైక్స్, కామెంట్స్ వస్తే వీడియో వైరల్ అవ్వడం మొదలవుతుంది.

ప్రేక్షకులతో కనెక్ట్ : యూట్యూబ్‌లో విజయం సాధించడానికి ప్రేక్షకులతో నిరంతరం కనెక్ట్ అయి ఉండటం అత్యంత కీలకమైన విషయం. మీ వీడియోలలో ప్రేక్షకులను ప్రశ్నలు అడగండి. కామెంట్ చేయడానికి ప్రోత్సహించండి. ప్రతి కామెంట్‌కు రిప్లై ఇవ్వడం ద్వారా మీ ప్రేక్షకులు మీకు చేరువవుతారు. మీ వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి, తద్వారా ఎక్కువ మంది వీక్షకులకు చేరుకోవచ్చు.

కంటెంట్ క్వాలిటీ : వీడియో నాణ్యతను మెరుగ్గా ఉంచుతూ, ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై వీడియోలు రూపొందించండి. ట్రెండింగ్ ఆడియో లేదా పాటలను ఉపయోగించడం వల్ల ఎక్కువ మంది వీక్షకులు మీ వీడియోలకు కనెక్ట్ అవుతారు. అలాగే వీడియోలకు మంచి శీర్షికలు, వివరణలు ఇవ్వండి. స్పష్టమైన వాయిస్‌ఓవర్ ఉండేలా చూసుకోండి. సబ్‌స్క్రైబర్ల ఆసక్తిని బట్టి కంటెంట్‌ను రూపొందిస్తూ, సరైన సమయానికి పోస్ట్ చేయండి.




