- Telugu News Photo Gallery How Apples Help Reduce Bad Cholesterol and Boost Heart Health, You Need To Know
Health Tips: యాపిల్ చేసే ఈ అద్భుతం గురించి తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెడతారు..
యాపిల్ అంటే ప్రతీ ఒక్కరు ఇష్టంగా తింటారు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు. యాపిల్ పండు మన ఆరోగ్యానికి అంత మంచిది. ముఖ్యంగా గుండె సమస్యలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాపిల్స్ అద్భుతంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో నిజమెత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Oct 21, 2025 | 8:24 PM

అలాగే ఆపిల్ కొనేటపుడు దాని వాసన చూడాలి. వాసన వేరేలా ఉంటే దానికి రసాయనాలు వేసి ఉన్నట్లు అర్ధం. సహజంగా పండిన ఆపిల్లకు తీపి వాసన ఉంటుంది. సహజంగా పండిన ఆపిల్స్‌పై చిన్నలేదా పెద్దవి మచ్చలు ఉంటాయి. అయితే, నకిలీ, రసాయనికంగా ఉత్పత్తి చేయబడిన ఆపిల్స్ మాత్రం మెరుస్తూ, మచ్చలు లేకుండా కనిపిస్తాయి.

రసాయనాలు వినియోగించిన ఆపిల్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందువల్ల కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన ఆపిల్స్, నకిలీ ఆపిల్స్ వివిధ మార్గాల్లో మార్కెట్లోకి చేరుతున్నాయి. కొన్నిఆపిల్స్ మెరుస్తు, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి వాటితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆపిల్ మెరుస్తూ ఉంటే, దానిపై వ్యాక్స్ వేసి ఉందని అర్ధం. సహజంగా పండిన ఆపిల్స్ అంత మెరుస్తూ ఉండవు.

ఆపిల్స్ లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఆపిల్స్ లో పొటాషియం కూడా ఉంటుంది. అందుకే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఒక ఆపిల్ తినాలని అంటారు. అయితే నేటి కాలంలో, అనేక రసాయనాలను ఉపయోగించి పండించిన ఆపిల్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి.

యాపిల్స్: యాపిల్స్ లో ఉండే ఫైబర్, విటమిన్ సి చర్మాన్ని దృఢంగా ఉంచడంలో, వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల మీ చర్మం ఛాయ మెరుగుపడుతుంది.

యాపిల్స్ చాలా ప్రభావవంతంగా పనిచేసినా, మంచి ఫలితం కోసం వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొగతాగడం మానేయడం, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించండి.




