ట్యాప్ తిప్పగానే హాట్ వాటర్ వస్తున్నాయా? ఈ సింపుల్‌ చిట్కాతో ట్యాంక్ వాటర్‌ని చల్లగా ఉంచుకోండి

Updated on: May 22, 2026 | 1:08 PM

How to keep water tank cool in summer: ఎంటీ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో నీరు వేడెక్కుతున్నాయి. ఇంట్లో ట్యాబ్ తిప్పిన ప్రతిసాది వేడి నీరే వస్తున్నాయి? అయితే ఈ వార్త మీ కోసమే.. సమ్మర్‌లో ప్రతి ఇంట్లో ఎదురయ్యే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అదిరిపోయే చిట్కాను తీసుకొచ్చాం. ఈ చిట్కాతో మీరు మండే ఎండలో కూడా మీ వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మే-జూన్ నెలల్లో ఉండే తీవ్రమైన ఎండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇంటి పైకప్పుపై ఉండే ప్లాస్టిక్ ట్యాంకులోని నీరు ఎంతగా వేడెక్కుతుందంటే, కుళాయి తిప్పితే చేతులు కాలిపోతాయేమో అన్నంత భయం వేస్తుంది. ఈ వేడి నీటి వల్ల మధ్యాహ్నం పూట స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం కూడా సాధ్యం కాదు.

2 / 5
ఈ క్రమంలో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు ఒక అద్భుతమైన దేశీయ చిట్కా బాగా వైరల్ అవుతోంది. ఈ చిట్కాను ఉపయోగించి. మీ   ట్యాంక్‌లోని నీరు వేడెక్కకుండా మీరు అడ్డుకోవచ్చు. అవును వంటగదిలో వాడే అల్యూమినియం ఫాయిల్ కాగితాన్ని వాటర్ ట్యాంక్‌కు చుట్టడం ద్వారా నీరు వేడెక్కకుండా సులభంగా అడ్డుకోవచ్చు.

3 / 5
సాధారణంగా సూర్యుని ప్రత్యక్ష కిరణాలు వికిరణం రూపంలో ప్లాస్టిక్ ట్యాంకుపై పడినప్పుడు, ఆ ప్లాస్టిక్ వేడిని త్వరగా గ్రహించి లోపలి నీటిని మరిగేలా చేస్తుంది. కానీ అల్యూమినియం ఫాయిల్‌ను ట్యాంక్‌కు చుట్టినప్పుడు అది ఒక శక్తివంతమైన రిఫ్లెక్టర్‌లా పనిచేస్తుంది. కాబట్టి ఫాయిల్ మెరిసే ఉపరితలంపై పడిన సూర్య కిరణాల తిరిగి పరివర్తనం చెందుతాయి. దీనివల్ల వేడి ప్లాస్టిక్‌కు చేరదు, లోపలి నీరు కూడా సాధారణంగా, చల్లగా ఉంటుంది.

4 / 5
ఈ చిట్కా ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచడమే కాకుండా, ట్యాంకుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. నిరంతరం సూర్యరశ్మి, అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల ప్లాస్టిక్ ట్యాంకులు మొత్తగా మారి పగిలిపోచే ప్రమాదం ఉంటుంది. కానీ అల్యూమినియం ఫాయిల్ ట్యాంకును ఎండ నుండి కాపాడి, దాని జీవితకాలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ట్యాంకులోని నీరు చల్లగా ఉండటం వల్ల, నీటిని మార్చడానికి పదే పదే మోటార్ వేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా నీటి వృధా కూడా అరికట్టబడుతుంది.

5 / 5
ఈ కూలింగ్ కవర్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి?: మొదట ట్యాంక్ బయటి భాగాన్ని తడి గుడ్డతో శుభ్రంగా తుడిచి, ఆరబెట్టండి. తర్వాత ట్యాంక్ ఎత్తుకు సరిపడా అల్యూమినియం ఫాయిల్‌ను పొడవాటి ముక్కలుగా కత్తిరించుకోండి. ఈ ఫాయిల్ ముక్కలను ట్యాంక్ పైభాగం నుండి కింది వరకు జాగ్రత్తగా చుట్టండి.ఊడిపోకుండా ఉండటానికి ఫాయిల్ అంచుల వెంట గట్టిగా ఉండే టేప్ లేదా దారంతో కట్టి బాగా బిగించండి. అంతే మీ వాటర్ ట్యాంక్ కూలింగ్ కవర్ సిద్ధమైనట్టే. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఈ స్మార్ట్ చిట్కాను మీరు కూడా ఈరోజే ప్రయత్నించి చూడండి.

Follow Us