కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల చిన్న వయస్సులో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, తప్పనిసరిగా వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవాలి. మసాలా, వేయించిన ఆహారాన్ని పూర్తిగా నివారించాలి. ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోతే కేవలం మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోలేరు.