మీ పిల్లలు తలపేనుతో బాధపడుతున్నారా.. బెస్ట్ టిప్స్ మీకోసం!

Updated on: Oct 06, 2025 | 9:21 AM

చాలా మంది పిల్లలు తల పేను సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పేలు అనేవి చాలా తర్వతగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటాయి. దీని వలన తలలో విపరీతమైన దురద, పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ తల పేను సమస్య నుంచి బయటపడాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పేల సమస్య అనేది చాలా ఇబ్బందికరమైనదని చెప్పాలి. దీని వలన చాలా మంది సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఇవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. తలపై విపరీతమైన దురదతో బాధపడుతారు. అందుకే తలలో పేలు లేకుండా చూసుకోవాలంట. అయిత తలలో పేలు ఉండకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

2 / 5
వేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలను చంపే సామార్థ్యం దీనికి ఎక్కువగా ఉంటుంది. అందువలన తల పేను సమస్య ఉన్న వారు వేపాకును నీటిలో శుభ్రంగా కడికి, ఆ ఆకును మెత్తగా పేస్టులా చేసి, నెల రోజుల్లో రెండు సార్లు తలకు పట్టించడం వలన తలలో పేను సమస్య తగ్గిపోతుంది.

3 / 5
 వేప పువ్వు చేదును పేలు తట్టుకోలేవు. అందువలన వేపాకునే కాకుండా వేప పువ్వుతో కూడా పేలను తరిమికొట్ట వచ్చును. దీని కోసం 100 గ్రాముల వేప పువ్వు తీసుకొని దీనిని కొబ్బరిన నూనెతో కలిపి బాగా మరిగించి వడగట్టుకొని, ఆ తర్వాత దీనిని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు మసాజ్ చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. అంతే పేలు అన్నీ రాలి కిందపడిపోయి పోతాయి.

4 / 5
తులసి ఆకు కూడా తలలో పేలను బయటకు పంపిస్తుంది. ఇది తలపై చికాకును కలిగించి, రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. అయితే తులసి ఆకులను కూడా కొబ్బరి నూనెలో వేసి మరగ బెట్టి ఆ నూనెను తలకు మర్దన చేయడం వలన కూడా తల పేను సమస్య నుంచి బయటపడవచ్చునంట

5 / 5
ప్రస్తుతం సీతాఫలాల సీజన్ నడుస్తుంది. శీతాకాలం ప్రారంభంలో ఇవి విపరీతంగా లభిస్తాయి. అయితే పేల సమస్యతో బాధపడే వారు ఈ సీతాఫలం గింజలను ఎండ బెట్టి, పొడి చేసి, మీరు తల స్నానం చేసే ముందు ఈ పొడిని నీటిలో వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించండి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే పేల సమస్య తగ్గుతందంట.

Follow Us